Begin typing your search above and press return to search.
బాహుబలి కావాలి.. ట్యూబ్ లైట్ వద్దా?
By: Tupaki Desk | 2 May 2017 6:42 AM GMTబాహుబలి ది కంక్లూజన్ మూవీ ఇండియన్ ఫిలిం హిస్టరీని తిరగరాసేస్తోంది. ఈ సెన్సేషనల్ మూవీని తిలకించే అవకాశం కావాలని పాకిస్తాన్ వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి2ని పాక్ లో కూడా విడుదల చేయాలని అడుగుతున్నారు అక్కడి జనాలు. పాక్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇదే కోరుతున్నారు. అనూహ్యమైన వసూళ్లను అక్కడ కూడా రిపీట్ చేసి కాసుల పంట కురిపించాలని కోరుకుంటున్నారు.
కానీ ఇదే పాకిస్తాన్ నుంచి సల్మాన్ ఖాన్ కు మాత్రం చుక్కెదురవుతోంది. సల్మాన్ లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది రంజాన్ కు ప్రేక్షకుల ముందుకు రానున్న ట్యూబ్ లైట్ ను అదే రోజున.. పాకిస్తాన్ లో కూడా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అయితే.. రంజాన్ అంటే పాక్ లో కూడా పెద్ద పండగే. అదే సమయానికి అక్కడ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సల్లూభాయ్ మూవీతో పోటీ పడగలిగే స్థాయి వాటికి ఉండదు.
అందుకే రంజాన్ రోజున పాక్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని.. ట్యూబ్ లైట్ విడుదలను అడ్డుకోవాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. ఈమేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు లేఖ రాయడం విశేషం. బాహుబలి2 విడుదల చేయాలని కోరుతున్న పాక్ నుంచి.. ఖాన్ సినిమా విడుదలకు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడం ఆశ్చర్యకరమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/