Begin typing your search above and press return to search.
ట్యూబ్ లైట్ ఫట్ మందట
By: Tupaki Desk | 23 Jun 2017 8:28 AM GMTఅగ్రహీరోల సినిమా విడుదల అయ్యిందంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్‌లుగా పేర్కొనే ఖాన్ల త్రయంలో ఒకడైన సల్మాన్ తాజాగా నటించిన ట్యూబ్ లైట్ ఈ రోజు విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీస్ దగ్గర బోల్తా పడినట్లుగా వార్తలు వచ్చేస్తున్నాయి. భజరంగీ భాయ్ జాన్.. సుల్తాన్ లాంటి భారీ విజయాల తర్వాత వస్తున్న ట్యూబ్ లైట్ మీద చాలానే అంచనాలు ఉన్నాయి.
వాటికి భిన్నంగా ఈ చిత్రం అభిమానుల మనసుల్ని గెలుచుకునే అవకాశమే లేదని తేల్చేస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ఏ మాత్రం లేని ఈ సినిమాకు రివ్యూలు ఇప్పటికే ఒక్క స్టార్ మాత్రమే ఎక్కువగా ఇస్తున్నారు. విమర్శకుల కత్తికి ట్యూబ్ లైట్ వెలగటం లేదంటున్నారు. దీనికి తోడు ప్రేక్షకుల స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందన్న మాట వినిపిస్తోంది.
ట్యూబ్ లైట్ నిరాశపరిచేలా ఉందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. సినిమా అందంగా ఉన్నా ఆత్మ లోపించిందంటూ ట్యూబ్ లైట్ అసలు ముచ్చట ఏమిటన్నది తేల్చేశాడు. హాలీవుడ్ మూవీ లిటిల్ బాయ్ స్ఫూర్తిగా చేసుకొని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో సల్మాన్ బుద్ధిమాంద్యం ఉన్న లక్ష్మణ్ సింగ్ బిప్త్ పాత్రలో నటించాడు.
సందేశం వరకూ ఓకే అయినా.. సినిమాలో ఫీల్ అయ్యేలా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. బలమైన స్క్రిప్ట్ లేకపోవటం పెద్ద మైనస్ గా మారిందని చెబుతున్నారు. సినీ అభిమానుల సంగతి తర్వాత.. సల్మాన్ అభిమానులకు కూడా ట్యూబ్ లైట్ నచ్చే ఛాన్సే లేదన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చూస్తుంటే.. సల్మాన్ ఓల్టేజ్ ఏ మాత్రం ఆయన తాజా చిత్రం ట్యూబ్ లైట్ వెలిగేందుకు సాయం చేయటం లేదని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/