Begin typing your search above and press return to search.
పఠిష్ట భద్రతలో సల్మాన్ ఖాన్..విచారణలో గ్యాంగ్ స్టర్!
By: Tupaki Desk | 14 July 2022 6:42 AM GMTబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్..అతని తండ్రి సలీంఖాన్ కి ఇటీవల గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులొచ్చిన సంగతి తెలిసిందే. పంజాబీ సింగర్ సిద్దు మూస్ వాలే లాగే ఇద్దర్నిఒకేచోట హతం చేస్తామని బెదిరించారు. ప్రస్తుతం సల్మాన్- సలీంఖాన్ లు పటిష్ట భద్రత నీడలో ఉన్నారు. సల్మాన్ ఇంటిచుట్టూ ముంబై పోలీసులు..స్పెషల్ టీమ్ భారీ భద్రత ఏర్పాటు చేసారు.
అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు చెప్పడానికి కూడా భాయ్ ఇంటి బాల్కనీలో కి కూడా రాలేదంటే ? సన్నివేశం ఎంత సీరియస్ గా ఉందో అద్దం పడుతోంది. భాయ్ చుట్టూ గ్యాంగ్ స్టర్లు కన్నేసి రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
సల్మాన్ కి ఇలాంటి బెదిరింపులు కొత్త కానప్పటికీ ఇప్పటికే వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఈసారి మరింత భద్రత గా వ్యవరించాల్సిన పరిస్థితులు తలెత్తడంతో బెదిరింపుల్ని సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబీ సింగర్ హత్య కేసులో ఢిల్లీ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ని విచారించగా సల్మాన్ హత్యపై జరుగుతోన్న కుట్ర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ విచారణలో బిష్ణోయ్ నుంచి ఢిల్లీ పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 2018 లో సల్మాన్ ఖాన్ ని అంతమొందించడానికి ముఠా సభ్యులలో ఒకర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు గ్యాంగ్ స్టర్ అంగీకరించారు.
అయితే అతను పిస్టల్ వినియోగించడం వల్ల టార్గెట్ మిస్ అయినట్లు తెలిపారు. బిష్ణోయ్ గ్యాంగ్ లోని మరో కీలక సభ్యుడు సంపత్ మెహ్రా కొన్ని సంవత్సరాల క్రితమే ముంబైకి వెళ్లాడు. కొన్నాళ్ల పాటు సల్మాన్ ని చంపాలన్న ఉద్దేశంతోనే ముంబైలో తిష్ట వేసినట్లు తెలిపాడు. సదరు గ్యాంగ్ స్టర్ అప్పుడు ఆర్ కె. స్ర్పింగ్ రైఫిల్ ని కూడా కలిగి ఉన్నారు.
దీని ధర నాలుగు లక్షలు ఉంటుందని విచారణ లో తేల్చారు. అప్పట్లో ఈ రైఫిల్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో గుర్తు చేసాడు. కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ ని కోర్టులు వదిలేసినా గ్యాంగ్ స్టర్లు వదిలేది మాత్రం లేదని బెదిరిపులు లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలోనే సల్మాన్ ని ఇంతలా టార్గెట్ చేసారా? లేక ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.