Begin typing your search above and press return to search.
కత్రినా కంట తడి సల్మాన్ కు కామెడీ అయ్యిందట
By: Tupaki Desk | 18 Jun 2017 10:31 AM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్.. బాలీవుడ్ బ్యూటీ కత్రినాల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అన్నది చాలా చాలా పాత విషయమే. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో రిలేషన్ నడిచినా.. వారిద్దరూ మాత్రం ప్రత్యేకంగానే వ్యవహరిస్తుంటారు. కటీఫ్ అయిన తర్వాత కూడా ప్రేమగా.. స్నేహంగా ఉంటారు. వారిద్దరికి పడని చాలామంది చెప్పినా.. వారిద్దరు కలిసిన ప్రతి సందర్భంలోనూ వారి మధ్య అనుబంధం వారి మాటల్లోనూ.. చేతల్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికి ఈ జంట భిన్నమనే చెప్పాలి.
లవ్ ట్రాక్ ముగిసిన తర్వాత.. విరుచుకుపడటం.. తప్పు పట్టేలా మాట్లాడే తీరుకు సల్మాన్.. కత్రినాలు దూరం. తాజాగా కత్రినా నటించిన జగ్గా జాసుస్ చిత్ర ప్రమోషన్ కోసం టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా సల్మాన్ ప్రస్తావన వచ్చినప్పుడు.. కండల వీరుడి గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. అతడిలో బయట వారికి తెలీని కొత్త కోణాన్ని చెప్పింది. సల్మాన్ ఎప్పుడూ తన కోసం ఏమీ చేయాలనుకోలేదని.. తాను ఎలా ఉండాలనుకున్నానో అలానే చూసేవాడని చెప్పుకొచ్చింది.
ప్రతి క్షణం తన వెన్ను తట్టి వెనుకాలే నిల్చున్నాడని.. తన కాళ్ల మీద తాను నిలబడేందుకు సాయం చేసేవాడని చెప్పుకొచ్చింది. మరి.. ఇద్దరి మధ్యనున్న బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ఏమిటని అడిగితే మాత్రం.. వేరే షోలో చెబుతానని చెప్పుకొచ్చింది. అయితే.. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెబుతూ.. సల్మాన్ తీరు ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేసింది.
ఒక రోజు తాను ఏడుస్తూ సల్మాన్ దగ్గరకు వెళ్లానని.. కానీ అతడు మాత్రం తనను చూసి నవ్వుతూనే ఉన్నాడంది. అప్పుడు సల్మాన్ ను చూసి.. ఈ వ్యక్తి ఎంత దుర్మార్గుడని అనుకున్నానని.. తన తొలి చిత్రంతోనే కెరీర్ క్లోజ్ అవుతుందని అనుకున్నానని చెప్పినా.. అతను నవ్వుతూనే ఉండటం తనను బాధించిందని చెప్పింది. ఆ టైంలో తాను చాలా ఫీల్ అయ్యానని.. కానీ.. అతడు చటుక్కున నవ్వు ఆపేసి.. నాకున్న సందేహాలన్నీ పెద్ద విషయాలు కావని చెప్పటమే కాదు.. భవిష్యత్తులో నేను ఏ స్థాయికి వెళతానన్న విషయాన్ని చెప్పాడంది.
నేను ఏం అనుకొని ఇండస్ట్రీకి వచ్చానో.. అవన్నీ జరుగుతాయని సల్మాన్ చెప్పటమే కాదు.. కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టాలని మిగిలిన విషయాల్ని పట్టించుకోవద్దని సలహా ఇచ్చాడంది. అతను చెప్పినట్లే నిజంగానే జరిగిందంటూ సల్మాన్ హీరోయిక్ గా వర్ణిస్తూ కత్రినా చెప్పుకొచ్చింది. ఏమైనా.. సల్మాన్ అంటే కత్రినాకు సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/