Begin typing your search above and press return to search.
సల్మాన్ కు ఆరోజు ప్రేమంతా ఇచ్చేస్తుందట!
By: Tupaki Desk | 20 Dec 2016 9:33 AM GMTఈ నెల (డిసెంబర్) 27న కండల వీరుడు సల్మాన్ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలకు సిద్దపడుతుండగా.. మరోవైపు బాలీవుడ్ లో కూడా రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు ఆయన శ్రేయోభిలాషులు, స్నేహితులు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఆరోజు సల్మాన్ కు లులియా వాంతుర్ ఇచ్చే గిఫ్ట్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ గా వార్తల్లో చక్కర్లు కొడుతున్న రష్యన్ భామ లులియా వాంతుర్ ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది.
సోమవారం రాత్రి సాన్ సూయి స్టార్ డస్ట్ అవార్డు కార్యక్రమానికి రెడ్ కార్పెట్ స్వాగతం అందుకుంది లిలియా. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్ కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ మీడియా ప్రశ్నించగా.. తొలుత కాస్తంత సిగ్గుపడిన ఈ భామ అనంతరం మనసులో మాట మీడియా ముందు చెప్పేసింది. "ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్ కు బహుమతిగా ఇచ్చేస్తాను" అంటూ చెప్పింది. అనంతరం ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా... "ఆరోజు అందరం కలిసే వేడుక జరుపుకుంటున్నాము" అని చెప్పి వెళ్లిపోయింది.
మరో విశేషం ఏమిటంటే.. ఈ కార్యక్రమంలో సల్మాన్ కూడా ఉన్నాడు. ఆయన ముందే బాడీగార్డ్ చిత్రంలో "తేరి మేరి ప్రేమ్ కహానీ" పాటను కూడా లులియా పాడి వినిపించి అబ్బురపరిచింది. కాగా, ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సంబంధాన్ని గురించి సల్మాన్ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం అప్పుడప్పుడూ సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/