Begin typing your search above and press return to search.
సుశాంత్ ఆత్మహత్యతో సల్మాన్ కు కొత్త చిక్కులు
By: Tupaki Desk | 18 Jun 2020 4:45 AM GMTయంగ్ స్టార్ సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య బాలీవుడ్ ప్రముఖులకు పెద్ద తలనొప్పిగా మారింది. బాలీవుడ్ లో ఉన్న ఒక మాఫియా కొత్త వారిని ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నారు అంటూ కరణ్ జోహార్.. సంజయ్ లీలా భన్సాలీ ఇంకా సల్మాన్ వంటి వారిపై విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన దివంగత నటి జియా ఖాన్ తల్లి రబీనా అమిన్ సంచలన వ్యాఖ్యలు చేసి సల్మాన్ ఖాన్ పై విమర్శలు గుప్పించారు.
తన కూతురు జియా ఖాన్ మృతి కేసును సల్మాన్ ఖాన్ తన డబ్బు పలుకుబడితో ప్రభావితం చేశాడు. ఆయన వ్యవస్థలను తనకున్న ఇమేజ్ తో తారు మారు చేసి కేసును పక్కదారి పట్టించాడు. తన కూతురు జియా ఖాన్ మరణంకు కారణం అయిన సూరజ్ పంచోలిని సల్మాన్ ఖాన్ కాపాడాడు. ఇండస్ట్రీలో ఉన్న వారిలో కొందరు మాత్రమే పైకి వచ్చేలా సల్మాన్ ప్రభావితం చేస్తాడంటూ అమిన్ ఆరోపించారు.
అలాంటి అణచివేత కారణంగానే సుశాంత్ బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీకి చెందిన కొందరు బెదిరింపులకు పాల్పడటంతో పాటు ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడటం లేదు అంటూ ఆమె పేర్కొంది. సుశాంత్ మరణం తర్వాత అయినా బాలీవుడ్ నుండి కొందరు అయినా మేల్కొని ఆ మాఫియాను అణచివేయాలంది.
ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఆ మాఫియాను అంతం చేయాలంది. 2013 సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణం సూరజ్ పంచోలి అనే ఆరోపణలు వచ్చాయి. అతడిపై కేసు నమోదు కాకుండా సల్మాన్ ఖాన్ కాపాడాడు అనేది అమిన్ రబీనా ఆరోపణ. మరి ఈ విషయమై సల్మాన్ ఖాన్ ఎలా స్పందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.