Begin typing your search above and press return to search.
సీనియర్ కామెడీ హీరో.. మొత్తం చెప్పేశాడు
By: Tupaki Desk | 8 Feb 2017 5:13 AM GMTబాలీవుడ్ హీరోగా.. డ్యాన్సులు కామెడీలతో 15ఏళ్ల పాటు చెలరేగిపోయాడు గోవిందా. ఆ తర్వాత పాలిటిక్స్ పై దృష్టి పెట్టడం.. అక్కడ ఫెయిల్ అవడంతో తిరిగి సినిమాల్లోకి రావడం.. హీరోగా అవకాశాలు రాక కేరక్టర్ వేషాలు వేయడం.. పరాజయాలు మూటకట్టుకోవడం జరిగిపోయాయి. ఇప్పుడు తనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మళ్లీ హీరోగా వచ్చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో.
ఆ గయా హీరో అంటూ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు గోవిందా. '2004-2009 మధ్య రాజకీయాల్లో ఉన్నాను. 2009 తర్వాత 9 సినిమాలు చేశాను. కానీ ఇవేవీ నా మనసుకు నచ్చినవి కావు. నేను చేసిన హాలిడే.. కిల్ దిల్.. హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలు కూడా నా భార్య సునీత చెప్పిన మాటల ప్రకారమే చేశాను. కాలంతో పాటు మారాలని ఆమె చెప్పిన మాట నచ్చింది. ఇప్పుడు సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేసేందుకు ఆమెను ఒప్పించాను' అన్నాడు గోవిందా.
'యంగ్ హీరోలు రణవీర్ సింగ్.. వరుణ్ ధావన్ లు నా మేనరిజమ్స్ కొన్ని ఇమిటేట్ చేస్తున్నారనే న్యూస్ నాకు నిజంగా సంతోషాన్నే ఇస్తుంది. అనీస్ బజ్మీ.. డేవిడ్ ధావన్ లతో సినిమాలు చేయరా అని అడుగుతున్నారు. నేను ఎవరితోనైనా మూవీస్ చేసేందుకు సిద్ధమే. అలాగే సల్మాన్ ఖాన్ నాకు సోదరుడు లాంటి వాడు. చాలామంచి రెమ్యూనరేషన్ తో కొన్ని కేరక్టర్స్ ఆఫర్ చేశాడు. కానీ వాటిని అర్ధం చేసుకుని చాలా కష్టపడి చేసే నటులు కావాలి. నాకు డబ్బులు అవసరమైన మాట నిజమే అయినా.. సల్మాన్ ఆఫర్ ని ఒప్పుకోలేకపోయా' అని చెప్పాడు గోవిందా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/