Begin typing your search above and press return to search.
షూటింగ్ కి బ్రేక్.. మొక్కలు నాటిన స్టార్ హీరో
By: Tupaki Desk | 22 Jun 2022 1:30 PM GMTతెలంగాణ రాష్ట్ర సమితి యంగ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో పర్యావారణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే ఉద్యమాన్ని మొదలు పెట్టారు. కొంత మంది స్టార్స్ ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ వారి చేత మొక్కలు నాటిస్తూ పలువురికి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. అంతే కాకుండా మన చుట్టూ వున్న కాలుష్యాన్ని తగ్గించడం కోసం పలువురు స్టార్ ల చేత అడవులని దత్త తీసుకునేలా చేస్తున్నారు.
సినీ సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి ప్రచారాన్ని కల్పిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు అడవులని దత్తత తీసుకునేలా చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సిటీ ఔట్ స్కర్ట్స్ లో వున్న అడవులని దత్తత తీసుకుని వాటి సంరక్షణ చూసుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ తరువాత దాదాపు 1000 ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున ఫ్యామిలీ దత్తత తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తమ వంతు సహాయ సహకారాలని అందిస్తోంది.
'లవ్ స్టోరీ' మూవీ ప్రి రిలీజ్ టైమ్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేత జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటించి ప్రత్యేకతని చాటుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో సల్మాన్ ఖాన్ మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సల్మాన్ మొక్కలను నాటడమే కాకుండా ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలని విధిగా నాటాలని తద్వారా గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ 'కభీ ఈద్ కభీ దివాళీ'. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ సినీ కార్మికుల మెరుపు సమ్మె కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడటంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరో వెంకటేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.