Begin typing your search above and press return to search.
#BIGBOSS భాయ్ ఫీజు అమాంతం కోసేశారు!
By: Tupaki Desk | 19 Sep 2022 11:30 PM GMTహిందీ బిగ్ బాస్ 16 కొత్త సీజన్ ప్రారంభం కానుంది. 01 అక్టోబర్ 2022న ప్రీమియర్ కి సర్వం సిద్ధంగా ఉంది. ఈ సీజన్ కు సల్మాన్ ఖాన్ కి చెల్లించే పారితోషికం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సల్మాన్ గతంలో రూ. 1000 కోట్లు వరకూ ఒక్కో సీజన్ కి వసూలు చేసాడని బోల్డ్ గా ప్రచారమైంది. కానీ అది నిజం కాదు. సల్మాన్ ఖాన్ కు గత సీజన్ కంటే తక్కువ పారితోషికం? సీజన్ 16కి చెల్లిస్తున్నారట.
సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ కి సీజన్ 4 నుండి హోస్ట్ గా ఉన్నారు. అతను ఇప్పటివరకు షో 12 సీజన్ లను హోస్ట్ చేసాడు. బిగ్ బాస్ 16కి కూడా హోస్ట్ గా తిరిగి వస్తున్నాడు. బిగ్ బాస్ 16 ప్రోమోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇది 1 అక్టోబర్ 2022న కలర్స్ టీవీలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. రియాలిటీ షోలో ఎవరు పాల్గొంటారు? అనే దాని గురించి అనేక కథనాలొస్తున్నాయి.
ఈసారి రేసులో పోటీదారులే కాకుండా సల్మాన్ ఫీజు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సంవత్సరం కూడా సల్మాన్ ఖాన్ షో కోసం వసూలు చేయబోయే మొత్తం గురించి అనేక కథనాలు వైరల్ అయ్యాయి. నిజానికి వెయ్యి కోట్లు అనేది అబద్ధమని తేలింది.
ఓటీటీలో బిగ్ బాస్ సీజన్ 1 ఆశించిన ఆదాయానికి తగ్గట్టుగా దక్కకపోవడంతో స్పాన్సర్ లు ఆసక్తి చూపలేదు. అందుకే బిగ్ బాస్ OTT తిరిగి రావడం లేదు. ఈ సంవత్సరం సల్మాన్ తన ఫీజులను పెంచడు. బదులుగా జీతం కోసేయనున్నారని కథనాలు పేర్కొన్నాయి.
బిగ్ బాస్ 15 కోసం 350 కోట్లు వసూలు చేసాడని కథనాలొచ్చాయి. ఇదే నిజమైతే ఈ సంవత్సరం అతను దాని కంటే తక్కువ పొందుతాడు. సూపర్ స్టార్ వసూలు చేసే ఫీజుల గురించి షో మేకర్స్ కానీ.. సల్మాన్ కానీ అధికారికంగా చర్చించలేదు.
బిగ్ బాస్ 16 పోటీదారుల్లో లాక్ అప్ విన్నర్ మునావర్ ఫరూకీ, ఖత్రోన్ కే ఖిలాడీ 12 ఫైసల్ షేక్ అకా మిస్టర్ ఫైసు,.. భాబీ జీ ఘర్ పర్ హై శుభాంగి అత్రే, .. ఇమ్లీ ఫహ్మాన్ ఖాన్,.. నుస్రత్ జహాన్,.. ఫ్లోరా సాలెబ్ తదితరులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. షో కోసం వారిని సంప్రదించారు. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి పేరు ప్రకటించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.