Begin typing your search above and press return to search.
సల్మాన్- షారూక్- హృతిక్` అవెంజర్స్ ఫీట్ రిపీట్!!
By: Tupaki Desk | 30 Jan 2022 2:30 AM GMTఎక్స్‌క్లూజివ్ కబురందింది. వార్ 2 తర్వాత భారీ స్పై యూనివర్స్ కథాంశంలో సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ లతో కలిసి హృతిక్ రోషన్ నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పఠాన్ గా షారుఖ్ ఖాన్.. టైగర్ గా సల్మాన్ ఖాన్ ... కబీర్ గా హృతిక్ రోషన్ ఎప్పుడు కలిసి తెరపై కనిపిస్తారనే దానిపై విస్తృతమైన ఊహాగానాలు హిందీ ఆడియెన్ లో సాగుతూనే ఉన్నాయి. హృతిక్ రోషన్ పఠాన్ లో లేదా టైగర్ 3లో కనిపించవచ్చని పరిశ్రమ ఊహాగానాలు చేస్తుండగా..తాజాగా నమ్మొచ్చు అనేలా ఒక కీలక అప్ డేట్ లీకైంది.
పఠాన్ - టైగర్ 3 స్క్రిప్ట్ లో ఏముందో తెలిసిన వారందరికీ హృతిక్ రోషన్ పాత్ర కబీర్ ఈ చిత్రాలలో దేనిలోనూ పఠాన్ లేదా టైగర్ ను కలవకూడదని అంతా చెబుతారు. ఆదిత్య చోప్రా వ్యూహాత్మకంగా తన గూఢచారి ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాడు. సల్మాన్ ఖాన్- హృతిక్ రోషన్ -షారుఖ్ ఖాన్ పాత్రలు వరుసగా.. టైగర్- పఠాన్ -కబీర్ ఒకరినొకరు కలుసుకునే క్షణం ఇప్పుడు కాదు. వార్ 2 తర్వాత మాత్రమే ఉంటుంది. ఇది మొదటి నుండి ప్రణాళిక ప్రకారం సాగుతోంది.. అని ఒక సోర్స్ వెల్లడించింది. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీల నుంచి హీరోల పాత్రలను కలుపుతూ ఒక యూనివర్శ్ ని నిర్మించడం అనేది హాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఫార్ములా. ఈ తరహాలో అవెంజర్స్ ఎంతో పెద్ద సక్సెసైంది.
ఆదిత్య చోప్రా `గూఢచారి విశ్వం` చాలా ఎగ్జయిట్ చేయబోతోంది. ఎందుకంటే ఇందులో వరుసగా సల్మాన్ ఖాన్ - షారూఖ్ ఖాన్ సరసన కత్రినా కైఫ్- దీపికా పదుకొనే వంటి బాక్సాఫీస్ క్వీన్ లు కూడా తమ అందాలతో ఆటాడబోతున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ముగ్గురు అతిపెద్ద సూపర్ స్టార్లు కలిసి నటించేప్పుడు YRF ప్రేక్షకులకు నెవ్వర్ బిఫోర్ ట్రీట్ ని ఇవ్వబోతోంది. ఇంకా ఎగ్జయిటింగ్ విషయమేమిటంటే పఠాన్ - టైగర్ 3 తర్వాత స్పై యూనివర్స్ లో `వార్ 2` ని చేర్చేందుకు.. తదుపరిది కావడానికి ఇప్పటికే యష్ రాజ్ సంస్థ పనిలో ఉందని క్లారిటీ వచ్చేసింది.
ముగ్గురు సూపర్ గూఢచారుల ఆన్-స్క్రీన్ మీటింగ్ ప్రేక్షకులందరికీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ తరహా ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ ని తేనుందని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారు. ఇక్కడ హీరోలందరూ సమావేశమవుతారు. ఆ అరుదైన క్షణం కోసం ప్రేక్షకులను ఎదురు చూసేలా చేయడంలో చోప్రా సఫలమవుతున్నాడు. ప్రస్తుతం ఇదంతా యూనివర్శ్ ని నిర్మించే ప్రక్రియలో భాగం. ఇది దేశంలోని ముగ్గురు దిగ్గజాల బ్లాక్ బస్టర్ కథల సమహారంగా మారనుంది. దాని కోసం ప్రణాళికలు సాగుతున్నాయి. ఆ క్షణం వరకు యూనివర్శ్ నిర్మాణం ఎలా జరుగుతుందో చూడాలంటే మనం ఓపికగా వేచి చూడాల్సిందే. ఈ ప్రాజెక్ట్ లను ఆస్వాధించే కొద్దీ కిక్కు అంతకంతకు రెట్టింపవుతుంది.
ఇదిలా ఉంటే పఠాన్ - టైగర్ 3 నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు సిద్ధార్థ్ ఆనంద్ -మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. త్వరలోనే యష్ రాజ్ బ్యానర్ నుండి రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వస్తుందని భావిస్తున్నారు.