Begin typing your search above and press return to search.
సల్మాన్ - వెంకీ మూవీ తాజా అప్ డేట్
By: Tupaki Desk | 14 May 2022 5:06 AM GMTసల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ డీన్ అన్న సంగతి తెలిసిందే. నటుడు నిర్మాత ఆల్ రౌండర్ అతడు. అందుకే ఇండస్ట్రీని దశాబ్ధాలుగా ఏల్తున్నాడు. అతడికి సౌత్ తో ఉన్న కనెక్షన్ చాలా పెద్దది. ఇక్కడ అగ్ర హీరోలకు అతడు సన్నిహితుడు. మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్- విక్టరీ వెంకటేష్- మహేష్ వంటి వారికి అత్యంత సన్నిహితుడు.
సల్మాన్ 55 ఏజ్ లోనూ ఎంతో యాక్టివ్ గా హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన కొత్త చిత్రం టైగర్ 3ని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం కాకుండా కభీ ఈద్ కభీ దీపావళి చిత్రీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసాడు. ఫర్హాద్ సంజీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మే 11న ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ ప్రారంభమైంది.
తాజా సమాచారం మేరకు.. జూన్ 1వ వారం నుండి వెంకటేష్ సెట్స్ పైకి జాయిన్ అవుతాడు. వెంకటేష్ ఇందులో ఫన్ ఫిల్డ్ రోల్ తో అలరించనున్నారు. ఈ సినిమాలో వెంకీ.. సల్మాన్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించనుండడంతో అది ఇరువురి అభిమానులకు స్పెషల్ కానుంది. ఇక పాన్ ఇండియా సినిమాల వెల్లువలో ఈ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేస్తారనే భావిస్తున్నారు.
మారిన ట్రెండ్ వల్లనే ఇలా ప్లాన్ మార్చాడా?ఇటీవలి కాలంలో సీన్ అంతా రివర్సు గేర్ లో ఉంది. బాలీవుడ్ స్టార్ల హవా అంతో ఇంతో తగ్గింది. అక్కడ అడపా దడపా మాత్రమే సినిమాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమాలను డామినేట్ చేస్తూ సౌత్ సినిమాలు వెల్లువెత్తుతుంటే .. భారీ వసూళ్లను సాధిస్తుంటే అది ఉత్తరాది హీరోలకు పాఠంగా మారింది.
ఇదిలా ఉండగా.. సౌత్ సినిమాని నార్త్ లో చూస్తున్నా.. నార్త్ సినిమాల్ని సౌత్ లో చూడకపోవడంపై హిందీ హీరోల్లో పెద్ద చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఇటీవలి కాలంలో షారూక్ ఖాన్- సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్ సైతం ఓ మెట్టు దిగి వచ్చి సౌత్ కథల్ని దర్శకుల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
ఇప్పుడు సల్మాన్ ఇంకో మెట్టు దిగి వచ్చి ఏకంగా విక్టరీ వెంకటేష్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తుండడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ చిత్రాన్ని సల్మాన్ స్నేహితుడు సాజిద్ నడియాద్ వాలా నిర్మించాల్సి ఉన్నా కుదరలేదు. ఈ మూవీలో వెంకీ పాత్ర పూర్తి నిడివితో ఉంటుందా? అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇందులో సల్మాన్ బావ గారైన ఆయుష్ శర్మ కూడా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కి ఖాన్ అవకాశం ఇవ్వడం వెనక మతలబు తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేయడమేనని కూడా చర్చ సాగుతోంది. కేవలం ఉత్తరాది మార్కెట్ తో ఇప్పుడు పాన్ ఇండియా రికార్డుల్ని కొట్టేయడం అంత వీజీ కాదు. అందువల్ల సల్మాన్ సహా ఇతరులు సౌత్ మార్కెట్లపై కన్నేశారు.