Begin typing your search above and press return to search.

లైగ‌ర్` కోసం వెయిట్ చేస్తోన్న మాలీవుడ్ స్టార్!

By:  Tupaki Desk   |   13 Nov 2021 9:35 AM GMT
లైగ‌ర్` కోసం వెయిట్ చేస్తోన్న మాలీవుడ్ స్టార్!
X
ఆనంద్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టించిన `పుష్ప‌క విమానం` ప్ర‌మోష‌న్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి స్ర్టాట‌జీతో ముందుకెళ్లారో తెలిసిందే. త‌మ్ముడి కెరీర్ కోసం...నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌డంతో విజ‌య్ సినిమా కోసం చాలా శ్ర‌మించారు. రిలీజ్ కు ముందు బిగ్ స్టార్స్ తో ప్ర‌మోట్ చేయించ‌డం...వాళ్ల పీడ్ బ్యాక్ తీసుకోవ‌డం వంటివి సినిమాకు మంచి ప‌బ్లిసిటీని తీసుకొచ్చాయి. తాజాగా `పుష్ప‌క విమ‌నాం `శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా రిలీజ్ కి ముందు విజ‌య్ తో స‌న్నిహితంగామెలిగే టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా విషెస్ తెలిపారు.

కాగా మ‌ల‌యాళం స్టార్ హీరో దుల్కార్ స‌ల్మాన్ కూడా ట్విట‌ర్ వేదిక‌గా విషెస్ చెప్పారు. అయితే ఈ ట్వీట్ విజ‌య్ ఆల‌స్యంగా స్పందించారు. రిలీజ్ త‌ర్వాత విజ‌య్ `లైగ‌ర్` కోసం లాస్ ఏంజిల్స్ కి వెళ్లాడు. జర్నీ అనంత‌రం రౌడీబోయ్ దుల్కార్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. `నువ్వు నా సోద‌రుడి లాంటి వాడివి. ప్ర‌యాణంలో ఉండ‌టంతో ట్వీట్ చూడ‌లేక‌పోయాను. నా టీమ్ ని వ‌దిలి వ‌చ్చాను అనే క‌ల‌లో నుంచి బ‌య‌ట‌కు ఇప్పుడే వ‌చ్చాను. నీ ట్వీట్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది` అని అన్నారు. అలాగే అదే రోజున దుల్కార్ స‌ల్మాన్ నించిన `కురుప్` కూడా రిలీజ్ అయింది. ఈ సిన‌మా కూడా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని విజ‌య్ ఆకాంక్షించారు.

దీంతో దుల్కార్ కూడా విజ‌య్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ఒక‌రి కోసం ఒక‌రు ఇలా స‌పోర్ట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. లాస్ ఏంజిల్స్ షూటింగ్ ఎంజాయ్ చేయ్. లైగ‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాను` అని పోస్ట్ చేసారు. విజ‌య్- దుల్కార్ మ‌ద్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంభాష‌ణ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. నేటి త‌రం హీరోలు ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకోవ‌డం ఇప్పుడు ఓ ట్రెండ్ లా కొన‌సాగుతోంది. పాత త‌రం హీరోల్లో ఇలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించేది కాదు. రిలీజ్ కోసం పోటాపోటీగా నిల‌బ‌డే వారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.