Begin typing your search above and press return to search.

చ‌రణ్‌- ఉపాస‌న జంట మేక‌ప్ ఆర్టిస్టు ప్రేమ పెళ్లి

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:30 AM GMT
చ‌రణ్‌- ఉపాస‌న జంట మేక‌ప్ ఆర్టిస్టు ప్రేమ పెళ్లి
X
రియాలిటీ టీవీ షో విజేత‌గా ఫేమ్ అయిన సల్మాన్ జైదీ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ ను వివాహం చేసుకోబోతున్నారు. టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని కొణిదెలకు జెబా హాస‌న్ వ్య‌క్తిగ‌త మేక‌ప్ ఆర్టిస్ట్.

అక్టోబర్ 16న ఈ జంట‌కు హైదరాబాద్ లో సంప్రదాయ వివాహం జరగనుంది. ప్ర‌స్తుతం పెళ్లి కి సన్నాహాలు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో జెబా హాసన్ తో స‌ల్మాన్ జైదీ నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. `ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్ 2` విజేత అయిన స‌ల్మాన్ త‌న లవ్ లైఫ్ గురించి ఆనందం వ్య‌క్తం చేసారు.

మా కుటుంబాలు సన్నిహిత మిత్రులతో ఒక సాధా సీదా వేడుక‌గా దీనిని జ‌రుపుకుంటామ‌ని అత‌డు తెలిపారు. సంగీత్ - రిసెప్షన్ - నికాహ్ తో `నాలుగు రోజుల వేడుక`గా ఈ పెళ్లి జ‌రుగుతుంద‌ని చెప్పారు. జైదీకి 27 ఏళ్ల హసన్ చాలా కాలంగా తెలుసు. అయితే గత మూడు సంవత్సరాలుగా చాలా సన్నిహితుల‌య్యారు. ``మాది ప్రేమ వివాహం ... చాలా కాలంగా తెలిసిన వ్యక్తిని వివాహం చేసుకోవడం సంతోషంగా ఉంది`` అని జైదీ పేర్కొన్నాడు.

జైదీ - హాసన్ (ఇద్దరికీ 27 ఏళ్లు) జంట‌ది ప్రేమ వివాహం అయినప్పటికీ ఇటీవల `ఎక్స్ ఆర్ నెక్స్ట్` అనే డేటింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న జైదీని చూసి సన్నిహితులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని మాజీ ప్రియురాలు న‌టి క్రిస్సన్ బారెట్టో కూడా ఈ షోలో భాగ‌మైంది.

అయితే ప్రియురాలు ఉండ‌గా ఇంత‌లోనే వేరొక యువ‌తితో ప్రేమ పెళ్లి అంటాడేమిటీ? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి. దానికి అత‌డు వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నాడు. టీవీ రియాలిటీ షో గత సంవత్సరం చిత్రీకరించిన‌ద‌ని ..త‌న నిశ్చితార్థానికి దాదాపు తొమ్మిది నెలల ముందు చిత్రీకరించార‌ని షోలో నా మాజీ కూడా ఉంటుంద‌ని నాకు తెలియదని అన్నాడు.

నేను అన‌వ‌స‌రంగా పట్టుబడ్డాను. కానీ ప్రదర్శన అంతటా నేను త‌నను తిరిగి ప్రేమించ‌లేనని ఖచ్చితంగా చెప్పాను`` అని తెలిపాడు. రియాలిటీ కంటెస్టెంట్ జైదీ గత సంవత్సరం మరొక డేటింగ్ రియాలిటీ షో `స్ప్లిట్స్ విల్లా`లో చేయాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో వెనక్కి తగ్గవలసి వచ్చింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.