Begin typing your search above and press return to search.
'బాలీవుడ్ హార్వే వెన్‌స్టన్' అంటూ సల్మాన్ మాజీ ప్రేయసి సంచలన పోస్ట్..!
By: Tupaki Desk | 1 April 2022 4:30 AM GMT90వ దశకంలో పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన పాకిస్తానీ-అమెరికన్ నటి సోమీ అలీ గురించి ఇప్పటి జనాలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆమె కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోందనే పుకార్లతో నిత్యం వార్తల్లో నిలిచింది.
పాతికేళ్ల క్రితమే నటనకు దూరమైన సోమీ.. ఇప్పుడు అమెరికాలో 'నో మోర్ టియర్స్' అనే సంస్థను నిర్వహిస్తోంది. మహిళా హక్కులు - లైంగిక వేధింపుల బాధితుల కోసం పనిచేస్తూ వారికి అండగా నిలుస్తోంది.
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసిగా ముద్ర పడిన సోమీ అలీ.. సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే లేటెస్టుగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది.
బాలీవుడ్ లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ సీనియర్ బ్యూటీ సోమీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కీలక వ్యాఖ్యలు చేయడం.. దీనికి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను కూడా ట్యాగ్ చేయడం.. వెంటనే దాన్ని డిలీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
''హార్వే వెన్ స్టన్ ఆఫ్ బాలీవుడ్. ఈ ప్రపంచానికి నీ గురించి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఎలాగైతే ధైర్యాన్ని ప్రదర్శించిందో అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదొక రోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు'' అని సోమీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
దీనికి సల్మాన్ ఖాన్ నటించిన 'మైనే ప్యార్ కియా' లోని 'ఆతే జాతే హస్తే గాతే' సాంగ్ ను జత చేసింది. బాలీవుడ్ లో మహిళలను వేధింపులకు గురి చేసిన ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆలోచించే లోపే.. ఆ పోస్ట్ ను సోమీ అలీ డిలీట్ చేయడం గమనార్హం.
కాగా, హార్వే వెన్ స్టెయిన్ 200కు పైగా సినిమాలు నిర్మించిన హాలీవుడ్ ప్రొడ్యూసర్. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన ఆయన.. 'మీటూ' 'కాస్టింగ్ కౌచ్' ఉద్యమాలకి ఆజ్యం పోసి మన దేశంలో కూడా సుపరిచితమయ్యాడు. 2017లో డజను మంది హీరోయిన్లకు పైగా హార్వేపై లైంగిక ఆరోపణలు చేయడంతో తెరపైకి వచ్చాడు.
పోలీసుల విచారణలో 80మందికి పైగా మహిళలపై హార్వే లైంగిక దాడులకు పాల్పడినట్లు వెల్లడి కావడంతో.. 2020 మార్చి 11న కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యావత్ చిత్ర పరిశ్రమ తలదించుకునేలా చేసిన హార్వే వెన్ స్టెన్ తో పోల్చుతూ బాలీవుడ్ లో కూడా అలాంటి వ్యక్తి ఉన్నట్లు సోమీ పోస్ట్ పెద్దడం చర్చనీయాంశంగా మారింది. ఆ కామాంధుడు ఎవరా అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.