Begin typing your search above and press return to search.

నాట్ ఔట్ అంటూ రేసులోకి దూసుకొచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2022 4:22 AM GMT
నాట్ ఔట్ అంటూ రేసులోకి దూసుకొచ్చిన‌ట్టేనా?
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించాల్సి ఉన్నా స‌మంత రూత్ ప్ర‌భు గ‌త కొద్దిరోజులుగా విదేశాల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల్లో త‌న ఉనికిని చాట‌క‌పోవ‌డంతో అభిమానుల్లో ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. స‌మంత‌కు అనారోగ్యంగా ఉంద‌ని చికిత్స కోసం అమెరికా వెళ్లింద‌ని కూడా గుస‌గుసలు వినిపించాయి. దీంతో పాటు ర‌క‌ర‌కాల‌ పుకార్లు కూడా వినిపించాయి. త‌నపై నిర్మాత‌లు సీరియ‌స్ గా ఉన్నార‌ని సామ్ సెట్స్ కి వచ్చే వ‌ర‌కూ వేచి చూసే ప‌రిస్థితి ఉంద‌ని కూడా ప్రచార‌మైంది. ఎట్ట‌కేల‌కు సామ్ ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ త‌న‌దైన శైలిలో జ‌వాబిచ్చింది.

సామ్ త‌న ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ చూడ‌గానే త‌ను హైద‌రాబాద్ లో స్వ‌గృహంలో అడుగుపెట్టింద‌ని అర్థ‌మైంది. సోఫాలో ముఖాన్ని దాచుకున్న తన పెట్ డాగ్ మహేష్ అక్కినేని ఫోటోని షేర్ చేసింది. ఈ ఫెటోతో పాటు 'డౌన్ నాట్ అవుట్' అనే క్యాప్షన్ ను రాసింది. దీంతో అనారోగ్యంతో బాధ‌ప‌డ‌డం నిజ‌మే కానీ తాను సుర‌క్షిత‌మేన‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది. ఇంకా దానినుంచి కోలుకుని పూర్తిగా బయటికి వచ్చిందనే మీనింగ్ స్ఫురించ‌డం లేదు. కానీ సమంతా ఇంటికి తిరిగి వ‌చ్చింది. త‌న ఫేవ‌రెట్ రెడ్ వెల్వెట్ సోఫా లో మ‌హేష్ అక్కినేని మారాం చేస్తూ క‌నిపించ‌డం చూడ‌గానే దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది.

సామ్ పోస్ట్ పై స్పందిస్తూ స్నేహితులు నీరజా కోన.. నందిని రెడ్డి 'హ‌లో' అని వ్యాఖ్యానించారు. వరుణ్ ధావన్ కూడా అదే పోస్ట్ లో 'స్ట్రాంగ్' .. 'హాయ్' ఎమోజీలను పోస్ట్ చేశారు. సమంత త‌దుప‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కుషీ చిత్రీక‌ర‌ణ‌లో జాయిన్ కావాల్సి ఉండ‌గా అత‌డు మాల్దీవుల వెకేష‌న్ కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అలాగే రాజ్ అండ్ డీకేతో వెబ్ సిరీస్ కోసం స‌మంత ప్రిప‌రేషన్ సాగించాల్సి ఉంది. నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. పైన పేర్కొన్న సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్ కి భారతీయ వెర్షన్. ఈ ప్రాజెక్ట్ కి భారీ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిస్తున్నందున లీడ్ పెయిర్ అందుకు అవ‌స‌ర‌మైన రూపాల‌ను సిద్ధం చేస్తున్నారు. నాయ‌కానాయిక‌లు పూర్తిగా టోన్డ్ లుక్ లో క‌నిపించాల‌ని రాజ్ అండ్ డీకే కోరార‌ట‌. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్ - డికెతో సామ్ చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది. మరోసారి ఈ కాంబినేష‌న్ సెన్సేష‌న్స్ సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

బాలీవుడ్ లో వ‌రుస‌గా..!స‌మంత ఇటీవ‌ల వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.రాజ్ అండ్ డీకే ప్రాజెక్టుతో పాటు.. ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ దినేష్ విజన్ త‌దుప‌రి చిత్రంలో నటించేందుకు స‌మంత అంగీక‌రించింది. స్త్రీ- భేదియా - ముంఝా తర్వాత అత‌డి నుంచి హారర్ కామెడీ రానుంది. మాడాక్ ఫిల్మ్స్ లో ఇది వ‌రుస‌గా నాల్గవ చిత్రం అవుతుంది. సమంతా రూత్ ప్రభు ఇందులో యువరాణిగా నటించనున్నారని క‌థ‌నాలొచ్చాయి.

ఈ హారర్-కామెడీలో ఆయుష్మాన్ ఖురానా పిశాచి పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ కోసం నిర్మాత దినేష్ విజన్ సమంతా రూత్ ప్రభుని సంప్రదించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల‌ ఈ ప్రాజెక్ట్ కి స‌మంత అధికారికంగా సంతకం చేసినట్లు తెలుస్తోంది. హారర్-కామెడీ విశ్వాన్ని (యూనివ‌ర్శ్) న‌డిపించే ఈ చిత్రంలో తార‌లంతా ఫాంటసీ పాత్రలను పోషిస్తారు. తాజా క‌థ‌నాల ప్రకారం..ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వ‌హిస్తారు. నిరేన్ భట్ స్క్రిప్ట్ అందిస్తున్నారు.

ఇటీవల‌ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి సామ్ వర్క్ షాప్ లలో పాల్గొంది. రాజస్థాన్ నేప‌థ్యంలో మరో జానపద కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని సామ్ ఈ మూవీలో రాజ్ పుత్ యువరాణిగా అలాగే ప్రేతాత్మ (దెయ్యం)గా న‌టిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఆయుష్మాన్ ఆమె ప్రేమికుడిగా కనిపిస్తారు. య‌శోద విడుద‌ల కావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.