Begin typing your search above and press return to search.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు సామ్ గ్రీన్ సిగ్న‌ల్

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:50 AM GMT
క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు సామ్ గ్రీన్ సిగ్న‌ల్
X
అక్కినేని కోడ‌లిగా స‌మంత పెళ్లి త‌ర్వాతా స్వేచ్ఛ‌గా సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఒప్పుకున్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేసాక ఓ బేబి త‌ర‌హాలో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశాల్లో న‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తూనే నాయికా ప్రాధాన్యం ఉన్న క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటుంద‌ని భావించారు. కానీ విధి వైచిత్రి వేరుగా ఉంది. నాలుగేళ్ల‌కే చైత‌న్య నుంచి విడిపోతున్న‌ట్టు స‌మంత ప్ర‌క‌టించి షాకిచ్చారు.

త‌మ మ‌ధ్య విభేధాలు త‌లెత్త‌డంతో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇటీవ‌ల అన్నిటినీ మ‌ర్చిపోయేందుకు స‌మంత వ‌రుస విహార‌యాత్ర‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యాత్ర‌ల్లో ఉన్నా కానీ ఓవైపు వ‌రుస ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి. శ్రీ‌దేవి మూవీస్ శివ‌లెంక‌తో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ప్లాన్ చేస్తోంద‌ని ప్ర‌చార‌మైంది. అలాగే త‌మిళంలోనూ వేరొక చిత్రానికి సంత‌కం చేసింది. మ‌రోవైపు బాలీవుడ్ సినిమాకి క‌మిటైంద‌న్న గుస‌గుస‌లు వైర‌ల్ అయ్యాయి.

ఇంత‌లోనే నాని స‌ర‌స‌న ద‌స‌రా అనే సినిమాకి క‌మిట‌వుతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో స‌మంత ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తుంది? అంటే.. రెగ్యుల‌ర్ క‌మర్షియ‌ల్ నాయిక‌గా క‌నిపిస్తుంద‌ట‌. ఇక‌పై వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు అవ‌స‌ర‌మైన గ్లామ‌ర్ యాంగిల్ ని సామ్ ఎలివేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అంటే ఇక‌పై తెలుగు త‌మిళంలో స్టార్ హీరోల‌కు తిరిగి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు తాను సంసిద్ధంగా ఉన్నార‌ని భావించ‌వ‌చ్చు. చ‌ర‌ణ్ - బ‌న్ని- ఎన్టీఆర్ - ప్ర‌భాస్ - ప‌వ‌న్ - మ‌హేష్ .. ఇలా స్టార్లంద‌రికీ సామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసేందుకు ఆస్కారం ఉంది. అటు త‌మిళంలో విజ‌య్-విశాల్- శివ‌కార్తికేయ‌న్- సేతుప‌తి వంటి స్టార్ల స‌ర‌స‌నా స‌మంత న‌టించేందుకు ఇక ఎలాంటి అభ్యంత‌రం ఉండదు. మ‌రోవైపు బాలీవుడ్ సినిమాలో న‌టిస్తే అది క‌చ్ఛితంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి సంబంధించిన‌దే అయి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ సిరీస్ ల‌లోనూ కాస్త ఘాటైన రొమాన్స్ కి ఆస్కారం ఉన్న పాత్ర‌ల‌కు స‌మంత క‌మిట‌య్యే ఛాన్సుంద‌ని ఊహిస్తున్నారు.