Begin typing your search above and press return to search.
చై లేకుండా సామ్ ఒంటరిగా గోవా టూర్?
By: Tupaki Desk | 4 Sep 2021 9:31 AM GMTఆయన లేనిదే తాను లేను! అన్నంతగా ఉండేది సన్నివేశం. కానీ ఆయన తన చెంత లేకున్నా పర్యటనలు బీచ్ పరిసరాల్లో షికార్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి! ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటే అక్కినేని నాగచైతన్య సతీమణి సమంత గురించే.
నాగ చైతన్యతో పెళ్లయిన కొత్తలో సమంత సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండేవారు. తమ దాంపత్య జీవన మధురిమల్ని ఆస్వాధనల్ని ఏమాత్రం దాచుకునే వారు కాదు. నిరంతర ఫోటోల్ని వీడియోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసి అక్కినేని అభిమానుల్లో జోష్ ని నింపేవారు సామ్. కానీ ఇంతలోనే ఏమైందో అంటూ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. పెళ్లయాకా సామ్ ఎంతో స్వేచ్ఛగా తన కెరీర్ ని సాగించారు. భర్త తో కలిసి సెలబ్రేషన్స్ ని హాటెస్ట్ ఫోజులను కూడా ఇన్ స్టాలో షేర్ చేయడం అన్యోన్యత తెలిసిందే.
కొన్నిసార్లు అక్కినేని కోడలిపై అభిమానులు సీరియస్ అయిన సందర్భాలున్నాయి. ఇంత ఘాటైన ఫోటోలేమిటో అంటూ అభిమానులు మండిపడిన సందర్భాలున్నాయి. కానీ ఆ తర్వాతి కాలంలో ఆ స్పీడ్ తగ్గింది. సినిమాల విషయంలో సెలక్షన్ లోనూ మార్పులు కనిపించాయి. గ్లామర్ అంశాల్లో బ్యాలెన్స్ కనిపించింది. కానీ కొంత గ్యాప్ తర్వాత సామ్ పై రూమర్స్ ఊహించని విధంగా వైరల్ అయ్యాయి. రకరకాల కారణాలతో మళ్లీ ఇటీవలి కాలంలో సామ్ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాల్లో తనపేరు చివరన ఉండే `అక్కినేని` ట్యాగ్ ని తొలగించి ఎన్నో అనుమానాలకు తెర తీసారు. అటుపై ఇంకెన్నో సందేహాలు కలిగే సమాధానాలతో సన్నివేశం మరింత హీటెక్కింది. దీంతో చైతూ నుంచి సామ్ దూరంగా ఉంటోందని మీడియాలో కథనాలు హీటెక్కించాయి. అదంతా అటుంచితే.. తాజా టూర్ లో సమంత సింగిల్ గా స్నేహితులతో ఎంజాయ్ చేయడం మరోసారి చర్చకు వచ్చింది. సమంత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి గోవా టూర్ వెళ్లారు. అక్కడ మరికొంత మంది స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఈ టూర్ కి చై వెళ్లలేదు. పెళ్లైన తర్వాత సమంత ఇలా హబ్బీ చైతన్య లేకుండానే సింగిల్ గా టూర్ వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే ఒంటరి పర్యటనకు కారణమేమిటో అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇదివరకటిలా చైతన్యతో నే కలిసి సమంత పర్యటనలు వెళితే బావుండేది... కానీ ఈసారి ఎందుకనో తన స్నేహితులతో కలిసి గోవా ప్లైట్ ఎక్కారు. మరి ఈ టూర్ కి చైతన్య బిజీగా ఉండి వెళ్లలేకపోయారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇటీవలే సమంత `శాకుంతలం` సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫ్రీ అయ్యారు. రిలీఫ్ కోసమే ఈ టూర్ వెళ్లారని భావించాలి. ఇక తనపై వస్తున్న రూమర్లకు సామ్ కాస్త అసహనంగానే ఉన్నారని ఇంతకుముందు షేర్ చేసిన ఈమోజీలు చెప్పాయి.