Begin typing your search above and press return to search.
యశోద పెట్టుబడికి.. ఈ టాక్ సరిపోదు!
By: Tupaki Desk | 12 Nov 2022 3:30 AM GMTటాలెంటెడ్ హీరోయిన్ సమంత నటించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ యశోద శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రిలీజ్ అనే మాటే గాని అందుకు తగ్గట్టుగా మాత్రం హడావిడి క్రియేట్ చేయలేకపోయింది. ఒక విధంగా సమంత కొంత స్వస్థతకు గురవడం కూడా ప్రమోషన్స్ లో హడావిడి అంతగా కనిపించలేదు.
నిర్మాతలు దర్శకులు మాత్రమే ఇంటర్వ్యూలతో సినిమాకు కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాను మొదట నాలుగు కోట్ల బడ్జెట్ తో అనుకుంటే ఆ తర్వాత 40 కోట్ల వరకు వెళ్లింది అని కూడా నిర్మాత ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం అందరినీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ సినిమా కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా కనెక్ట్ అవుతుంది అని నిర్మాత ఎంతో కాన్ఫిడెంట్గా ఖర్చుపెట్టినట్లుగా చెప్పాడు.
అయితే యశోద సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా 20 కోట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా సక్సెస్ కావాలి అంటే రిలీజ్ రోజు వచ్చిన టాక్ అయితే ఎంత మాత్రం సరిపోదు. పైగా ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ స్థాయిలోనే వచ్చాయి. అటు ఇటుగా చూసుకుంటే ఇండియా మొత్తంలో మొదటి రోజు మూడు కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
నిర్మాత అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20 కోట్లతో సగం వరకు సేప్ అయ్యాడు. ఇక థియేట్రికల్ గా ఈ సినిమా మరో 20 కోట్లు చేయగలిగితేనే పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత ప్రాఫిట్స్ వచ్చినట్లు లెక్క. ఇక సినిమా అయితే మొదటి రోజు టాక్ ను బట్టి రెండవ రోజు కూడా కలెక్షన్స్ ఎంతవరకు పెంచుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది శనీ ఆదివారాలు కలెక్షన్స్ పెరిగితేనే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక వీకెండ్ తర్వాత ఈ సినిమాను పట్టించుకోవడం కూడా కాస్త కష్టమని చెప్పవచ్చు. మరి మొత్తంగా యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.