Begin typing your search above and press return to search.
వ్వాట్ సామ్.. ఓ వైపు డిటాక్స్ మరోవైపు కరాటే..!
By: Tupaki Desk | 29 Aug 2022 11:30 PM GMTఅందాల సమంత రూత్ ప్రభు కొంతకాలంగా తనకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. నాగచైతన్యతో బ్రేకప్ తర్వాత సామ్ ఇలా ఎందుకు చేస్తోంది? అంటే దానికి సమాధానం లేదు. దీనిని అభిమానులు సోషల్ మీడియా డిటాక్స్ అని కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు.
నిజానికి సామ్ సోషల్ మీడియా నెగిటివిటీ గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడుతుంది. నటిగా చాలా ప్రొఫెషనల్ గా ఉంటూ తన బాధ్యతను నెరవేర్చడమెలానో తెలిసిన నటి. కానీ ఇటీవల ఎందుకనో ఇన్ స్టాగ్రామ్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఇంతకుముందులా ఎడా పెడా ఏదో ఒకటి పోస్ట్ చేయడం లేదు. వ్యాఖ్యలను కూడా ఆచితూచి తరచి తరచి ప్లాన్ చేస్తోంది.
నిజానికి సమంత చుట్టూ చాలా చాలా జరుగుతున్నాయి.. సామ్ తన శక్తినంతా తనపైనే పెట్టుబడి పెట్టాలనుకుంటోందన్నది ఎవరికీ తెలియని నిజం. అందుకే తన సోషల్ మీడియా డిటాక్స్ లో ఉంది. అలాగే రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో తన పాత్ర కోసం సమంత పట్టుదలగా సిద్ధమవుతోంది. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటోంది. ఇదంతా తన పాత్ర కోసం ప్రిపరేషన్ లో భాగం.
కాకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత సాధారణ కంటెంట్ ను అప్ లోడ్ చేయకుండా దూరంగా ఉంచి దాదాపు నెల రోజులు కావస్తోంది. సామ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన సినిమా విడుదల తేదీని ప్రకటించే వరకూ సోషల్ మీడియాలను టచ్ చేయదని సమాచారం.
ఇక చైతన్య వ్యవహారం మరోలా ఉంది. `లాల్ సింగ్ చద్దా` విడుదల సమయంలో నాగ చైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత తన జీవితం గురించి ఓపెనయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో అతడు .. నేను చాలా సంతోషకరమైన స్థానంలో ఉన్నానని చెప్పాడు. చై తన వ్యక్తిగత జీవితం గురించి.. సమంతా నుండి విడాకుల గురించి మాట్లాడటం తనకు బోరింగ్ అని అన్నాడు. ఇక కాఫీ విత్ కరణ్ షోలో సమంత నర్మగర్భంగా మాట్లాడుతూ... పెళ్లిళ్లు అందంగా లేవు.. భయానక యుద్ధాల్లా మారుతున్నాయని కూడా వ్యాఖ్యానించింది. మొత్తానికి ఆ ఇద్దరి మధ్యా కలతల తీవ్రతను ఈ వ్యాఖ్యలు బయటి ప్రపంచానికి ఆవిష్కరించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.