Begin typing your search above and press return to search.
23 గం.లు సామ్ అడిక్షన్ దేనికి?
By: Tupaki Desk | 29 March 2019 5:55 AM GMTఅక్కినేని సమంత అసలు గుట్టు తెలిసింది. 24 గంటల్లో 23 గంటల సమయాన్ని తను ఏ పనికి కేటాయిస్తారు? అంటే టాప్ సీక్రెట్ ఒకటి లీకైంది. ఇంతకీ లీక్ చేసింది ఎవరో తెలుసా? హబ్బీ నాగచైతన్యనే. చై- సామ్ జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన `మజిలీ` ఏప్రిల్ 5న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైతూ, సమంత ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే ఒకరి గుట్టు ఒకరు లీక్ చేశారు.
అసలు సమంత 24 గంటల్లో తన సమయాన్ని ఎక్కువగా దేనికి కేటాయిస్తుంది? అన్న ఓ ప్రశ్నకు నాగచైతన్య స్వయంగా ఆన్సర్ చేశారు. 23 గంటలు కేవలం సోషల్ మీడియాకే అడిక్ట్ అయ్యి ఉంటుందని అసలు గుట్టు చెప్పేశారు. ఇక సమంత నటించిన `ఈగ` సినిమాలో సామ్ స్టడీ ఏంటో చెప్పడంలో చైతూ తడబడ్డాడు. ఆ ఆర్ట్ ఏంటో తిరిగి సామ్ స్వయంగా చెప్పాల్సి వచ్చింది. చైతూ మాత్రం అదేదో చేస్తుందిలే అంటూ నసిగాడు.
మధ్య తరగతి కష్టాలు, బాధల నేపథ్యంలో తెరకెక్కిన `మజిలి` చిత్రంపై ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్ కి కచ్ఛితంగా నచ్చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో చైతన్య క్రికెటర్ గా నటిస్తుండడం మరో ఆసక్తికరమైన ఎలిమెంట్. అయితే ఎమోషన్స్ పండించడంలో.. కామెడీని ఎలివేట్ చేయడంలో సక్సెస్ ని బట్టి జనాదరణ దక్కుతోంది. ఆ రెండు విషయాల్లో శివనిర్వాణ పనితనం ఈ సినిమాతో బయటపడుతుందని విశ్లేషిస్తున్నారు. `నిన్నుకోరి` తర్వాత అతడు తెరకెక్కిస్తున్న రెండో చిత్రం కావడంతో ద్వితీయ విఘ్నంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ రేర్ ఫీట్ అతడికి సాధ్యమేనా? అన్నది చూడాలి.