Begin typing your search above and press return to search.
సామ్ కు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
By: Tupaki Desk | 19 Dec 2022 10:30 AM GMTసమంత.. తెలుగు, తమిళ భాషల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడు. ఉభయ ఇండస్ట్రీల్లో సమంత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాకుండా నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ తో నేషనల్ వైడ్‌గా గుర్తింపునిని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ లో డీ గ్లామర్ పాత్రలో రాజీగా నటించి బోల్డ్ సీన్ లతో టాక్ ఆఫ్‌ద ఇండియాగా నిలిచింది. ఈ సిరీస్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమంత ఆ తరువాత నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా శివ నిర్మాణ తెరకెక్కిస్తున్న 'ఖుషీ' మూవీలో నటిస్తోంది. తను నటించిన మహిళా ప్రధాన చిత్రాల్లో సరోగసీ మాఫియా నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద' రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న మైథలాజికల్ మూవీ 'శాకుంతలం' త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్ లలో ఈ మూవీని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.
నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే రీసెంట్ గా తను మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సమంత అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న సమంత ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
తనకు కోపం వచ్చినప్పుడు జిమ్ కు వెళ్లి తనకు ఇష్టం వచ్చినట్టుగా వర్కవుట్ లు చేస్తానని, దాంతో నా కోపం తగ్గిపోతుందని తెలిపింది. తాను డబ్బు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడనని, తనకు డబ్బు కన్నా నటనే ముఖ్యమంది. నటించే ప్రతి పాత్రని ఆస్వాదిస్తానని, అలా నటించకపోతే ఎలాంటి సంతోషం, ప్రయోజనం వుండదని తెలిపింది. ఈ విషయంలో నాకు నేనే పెద్ద విమర్శకురాలినని, మన తప్పులు, పొరపాట్లని మనం సరిదిద్దుకున్నప్పుడే వృత్తిలో ఉన్నత స్థాయికి వెళ్లగలమని స్పష్టం చేసింది.
అంతే కాకుండా కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదని, అలాంటి సమయం ఎదురైనప్పుడు దాని గురించి చింతించకుండా హాయిగా నిద్రపోతానంటోంది. నీకు నచ్చినట్టుగా నువ్వుండు..నువ్వు ఈ భూమి మీదికి వచ్చింది ఇతరుల మెప్పు పొందడానికో.. ఇతరులని సంతోష పెట్టడానికో కాదు. సమయం.. సందర్భం అనుకూలంగా మారితే అవసరమైన వన్నీ అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని లైఫ్ ఫిలాసఫీని చెప్పుకొచ్చింది సామ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.