Begin typing your search above and press return to search.

లవర్ పేరు చెప్పేస్తానన్న సమంత

By:  Tupaki Desk   |   22 May 2016 10:32 AM IST
లవర్ పేరు చెప్పేస్తానన్న సమంత
X
ఓ పెళ్లికాని యంగ్ హీరోతో సమంత లవ్. ఇది టాలీవుడ్ లో చాన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్. ఇప్పటివరకూ ఈ ప్రేమ విషయాన్ని సమంత అధికారికంగా కన్ఫాం చేయలేదు. ఓ సారి మాత్రం 'ఐయామ్ నాట్ సింగిల్' అంటూ అభిమానులతో చిట్ చాట్ చెప్పడం తప్ప.. ప్రేమ విషయంలో ఓపెన్ అవలేదు. ఇప్పుడీ వార్తలన్నీ నిజమేనని శామ్స్ ఒప్పేసుకుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో యంగ్ హీరోతో లవ్ లో ఉన్నారట నిజమేనా అని అడిగితే.. 'యస్ - నేను లవ్ లో ఉన్నాను, అయామ్ ఇన్ లవ్' అని చెప్పేసింది సమంత. తన బాయ్ ఫ్రెండ్ లో చాలా క్వాలిటీస్ తనకు నచ్చాయని.. అన్నిటికీ మించి తనను పూర్తిగా అర్ధం చేసుకునేవాడు కావడంతోనే.. ప్రేమలో పడిపోయానని అంటోంది సమంత. చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ఆ హీరో.. తను పెళ్లి తర్వాత సినిమాలు చేసేందుకు కూడా ఒప్పుకుంటాడని అంటోంది.

గతంలో ఓ సారి ప్రేమ వ్యవహారాన్ని పబ్లిక్ చేసి, తర్వాత బ్రేకప్ చెప్పాల్సి రావడంతోనే.. ఇప్పుడు సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారట. తన బాయ్ ఫ్రెండ్ కి వంట సూపర్ గా వచ్చని, తను వండుతుంటే తినడానికి సిగ్గేస్తుండడంతో.. ఇప్పుడో బ్రేక్ తీసుకుని మరీ వంటలు నేర్చుకుంటోందట శామ్స్. ఇన్ని చెప్పి ఆ కుర్ర హీరో ఎవరు అంటే మాత్రం.. 'అప్పుడే కాదు.. జస్ట్ కొన్ని నెలలు ఆగండి చెప్పేస్తా' అంటూ ఫినిషింగ్ ఇచ్చింది శామ్స్.

ఏళ్ల నుంచి పరిచయం ఉంది.. బాగా ఓపెన్ మైండ్.. హెల్పింగ్ నేచర్ ఎక్కువ.. వంట.. ముఖ్యంగా నాన్ వెజ్ బాగా వండుతాడు.. పెళ్లి తర్వా కూడా సినిమాలకు ఓకే చెబుతాడు.. అన్నిటికీ మించి యంగ్ హీరో.. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో మీకు అర్ధమైందా?