Begin typing your search above and press return to search.
వీళ్ళందరూ క్లోజ్.. ఏదన్నా రాస్కోండి
By: Tupaki Desk | 12 May 2016 5:22 AM GMT''ఈ మధ్యన రూమర్లను పట్టించుకోవడం మానేశాను. నేను వాటికంటే చాలా పెద్దదానినిగా ఫీలవుతున్నారు. నా స్నేహితుల వలన ఇప్పుడు చాలా కామ్ పర్సన్ గా మారిపోయాను'' అని చెప్పుకొచ్చింది సమంత. తను ఒక హైదరాబాద్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటాననేది వాస్తవమే కాని.. పేరు మాత్రం చెప్పనంది. అయితే తన స్నేహితుల చిట్టా చెప్పుకొచ్చింది.
''నాకు ఇప్పుడు కొంతమంది స్నేహితులు ఏర్పడ్డారు. అ..ఆ డైరక్టర్ త్రివిక్రమ్ మాంచి స్నేహితుడు. ఆయనకు ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తా. ఏదైనా అడుగుతా. అలాగే నాగచైతన్య - విక్రమ్ కుమార్ - నితిన్ అండ్ నీరజా కోన కూడా నాకు మాంచి ఫ్రెండ్స్. ఎనీటైమ్ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇక వీళ్ళలో కొంతమంది గురించి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఐ డోంట్ కేర్'' అని చెప్పింది అమ్మడు. ''నేను ఏం చేస్తున్నానో వాళ్ళకు తెలుసు. వాళ్లేంటో నాకు తెలుసు. ఇక ఎలాంటి రూమర్లు వస్తే మాకేంటి?'' అని సమంత అడగటంతో.. అందరూ స్టన్ అయ్యారంతే.
అయితే ఇప్పటికే తనక 29 ఏళ్ళు వచ్చేశాయి కాబట్టి.. త్వరలోనే పెళ్ళిచేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటోందట. ''సెట్ లో మహేష్ కూతురు సితార.. ఎన్టీఆర్ కొడుకు అభయ్.. అలాగే నీరజ (కోన) కొడుకులను చూస్తుంటే.. మనకెప్పుడు పిల్లలు అని అనిపిస్తోంది. ఇలాంటి హెక్టిక్ లైఫ్ లో ఉంటే ఆ ఆనందాలు మిస్సయిపోతాం. కాబట్టి త్వరలోనే పెళ్లి ప్లాన్ చేసుకుంటా'' అంటూ ముగించింది అమ్మడు.