Begin typing your search above and press return to search.
సామ్ ని కష్ట కాలంలో ఆదుకున్న షాడో
By: Tupaki Desk | 19 Oct 2021 4:30 PM GMTజీవితంలో మంచి స్నేహితులు కనీసం ఇద్దరు అయినా ఉండాలని అంటారు. ఒకరు అందుబాటులో లేకపోయినా ఇంకొకరు కష్ట కాలంలో తోడుగా ఉంటారనేది పెద్దల ఫిలాసఫీ. ఆ కోణంలో చూస్తే సమంతకు ఇండస్ట్రీలో కొందరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో డిజైనర్ శిల్పారెడ్డికి సామ్ కి మధ్య స్నేహానుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. ఈ కష్ట కాలంలో తనకు ఇలాంటి గొప్ప స్నేహితురాలు లేకపోయి ఉంటే ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఎలానో ఊహించలేం.
నాగ చైతన్య నుంచి విడిపోయిన బాధను మరచిపోవడానికి సమంత ఎక్కువ సమయం తన స్నేహితురాలు శిల్పారెడ్డితోనే గడుపుతున్నారు. తనతో ఇంతకుముందు గోవా బీచ్ కి షికార్ వెళ్లారు. చాలా వరకూ అక్కడ రిలీఫ్ పొందారు. ఇక హైదరాబాద్ లోనే ఉంటే మరో మార్గం ఉంది. అదే జిమ్ కి వెళ్లడం వర్కవుట్లు చేయడం.. ఇటీవల సామ్ వర్కవుట్ లతో పాటు ఇన్ స్టాగ్రామ్ తో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె తన వ్యాయామాల వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.
తాజాగా శిల్పా రెడ్డి కుటుంబంతో ఆడిన టగ్ ఆఫ్ వార్ గేమ్ వీడియోను సమంత మళ్లీ షేర్ చేసారు. సమంత తన స్నేహితులతో కలిసి తాడు లాగుతున్నారు. అందరూ నేలపై పడి బిగ్గరగా నవ్వడం కనిపించింది, ఫన్ గేమ్ ని గెలిచేందుకు ఎవరికి వారు తీవ్రంగానే శ్రమించారు. బల ప్రయోగం చేసారు. కానీ కింద పడ్డారు. ఆ క్రమంలోనే నవ్వులతో జిమ్ అంతా ప్రతిధ్వనించింది.
``బ్యూటీఫుల్.. క్రేజీ.. ఫన్...నా బెస్ట్ తో ఈ వారం గడిచింది`` అంటూ సామ్ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. అదే పోస్ట్ లో ``పిచ్చిగా.. వెర్రి పోటీ కుటుంబంతో ఎప్పుడూ గ్రూప్ యాక్టివిటీస్ లో పాల్గొనకండి ... మీరు బాధపడతారు.. మీకు నొప్పి అనిపిస్తుంది`` అని ఆమె రాసింది. శిల్పా రెడ్డి ఫిట్ నెస్ నిపుణురాలు.. న్యూట్రిషనిస్ట్.. ఫ్యాషన్ డిజైనర్ కూడా.
సెలబ్రిటీ ప్రపంచంలో పాపులర్ నేమ్ ఇది. తను సమంతకు ఈ కష్టకాలంలో అండగా ఉన్నారని అర్థమవుతోంది. విడాకుల ఒత్తిడి పై పోరాడటానికి ఆమె సమంతకు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సామ్ వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వృత్తిగతంగా బిజీ అయినా వ్యక్తిగత ఒత్తిళ్లను అధిగమించవచ్చని సామ్ భావిస్తోంది. శిల్పారెడ్డి కుటుంబంతో సామ్ ఎంతో ఆనందంగా ఉన్నారని అర్థమవుతోంది. ఆసక్తికరంగా అక్కినేని కుటుంబం కూడా శిల్పారెడ్డికి ఎంతో క్లోజ్ అన్న సంగతి తెలిసిందే.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి