Begin typing your search above and press return to search.

సమంత ఎంత ఎదిగిపోయిందో చూశారా?

By:  Tupaki Desk   |   6 Aug 2015 11:16 PM IST
సమంత ఎంత ఎదిగిపోయిందో చూశారా?
X
సంతకం పెట్టే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి చేరుకోవడమే ఎదుగుదల అంటే అన్నారు దివంగత అబ్దుల్ కలాం. సమంత తన ఎదుగుదలను కలాం మాటలతో పోల్చి చూసుకుంటోంది. ఒకప్పుడు తాను ఎవరిని చూడ్డానికి ఎగబడ్డానో ఇప్పుడు అదే హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తుండటం చాలా థ్రిల్లింగ్ ఉందని చెబుతోంది సమంత. ఆ హీరో మరెవరో కాదు.. సూర్య. కాలేజీ రోజుల్లో సమంత సూర్య అంటే పడి చచ్చేదట. అతడు తెరమీద కనిపిస్తే తాను నిలవలేకపోయేదాన్నని.. అలాంటిది ఒకసారి తన కాలేజీకే వచ్చేసి తనకు దిమ్మదిరిగే షాకిచ్చాడని.. ఇప్పుడు ఆయన పక్కన హీరోయిన్ గా నటిస్తుండటం ఇంకా పెద్ద షాక్ అని చెబుతోంది సమంత.

‘‘నా జీవితం నాకిచ్చే షాకులకు అంతే లేదు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చాక నాకు రోజుకో కొత్త అనుభూతి కలుగుతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. అందుకు నా జీవితమే ఉదాహరణ. కాలేజీ రోజుల్లో నేను సూర్యకు పెద్ద ఫ్యాన్. ఆయన హీరోగా చేసిన కాక్క కాక్క చూసి పిచ్చెక్కిపోయా. ఓ రోజు అనుకోకుండా సూర్య మా కాలేజీలో ఓ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చారు. ఎప్పుడూ కల్చరల్ ప్రోగ్సామ్స్ కి దూరంగా ఉండే నేను ఆ రోజు సూర్యను చూడ్డానికి ముందు వరసలో కూర్చున్నా. సూర్య సూర్య.. అంటూ ఒకటే గోల చేశా. నా అరుపులకు సూర్య కూడా కంగారు పడ్డట్లున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నేనాయన పక్కన హీరోయిన్. రేపటి రోజు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం. కాబట్టి మంచి రోజుల కోసం ఎదురు చూడండి’’ అని సెలవిచ్చింది సమంత. గత ఏడాది సూర్య పక్కన ‘సికిందర్’ సినిమాలో నటించిన సమంత.. ప్రస్తుతం ‘24’లో అతడి సరసన కనిపించనుంది.