Begin typing your search above and press return to search.
సామ్ 'ఊ అంటావా' సాంగ్ చేయడం వెనకున్న అసలు ఉద్దేశ్యం ఇదే..!
By: Tupaki Desk | 22 July 2022 4:45 AM GMTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన కెరీర్ లోనే తొలిసారిగా చేసిన ఐటమ్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా'. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఊపేసింది. పొట్టి పొట్టి దుస్తుల్లో సామ్ వేసిన స్టెప్పులు.. ఆమె ఎస్ప్రెషన్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ముఖ్యంగా మగవాళ్ల వంకర బుద్ధి మీద సెటైర్ వేసేలా ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత నటించిన సాంగ్ కావడంతో ఆ లిరిక్స్ ను ఆమె వ్యక్తిగత జీవితానికి లింక్ చేస్తూ అనేక కథనాలు వచ్చాయి. లేటెస్టుగా అసలు 'ఊ అంటావా' పాట చేయడం వెనకున్న అసలు ఉద్దేశ్యం ఏంటనేది సామ్ వెల్లడించింది.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న'కాఫీ విత్ కరణ్' టాక్ షోకి హీరో అక్షయ్ కుమార్ తో కలిసి గెస్టుగా హాజరైంది సమంత. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీలు ఇద్దరూ ఈ షో వేదికగా అనేక విషయాలు మాట్లాడారు.
ఈ సందర్భంగా 'ఊ అంటావా' పాటలో సమంతా హాట్ హాట్ గా కనిపించడం గురించి ప్రస్తావించిన కరణ్.. ఆమె పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నారు. ఆ పాట చేయడానికి కారణమేమిటని సామ్ ని అడగ్గా... సమంత బదులిస్తూ సాంగ్ ట్యూన్ తనకు నచ్చిందని.. అది మగవారి చూపులపై సెటైర్ అని తెలిపింది. పురుషుడి చూపుపై వ్యంగ్యాస్త్రాలు సంధించే ఐటెం నంబర్ చేసినందుకు తనపై విమర్శలు కూడా వచ్చాయని చెప్పింది.
''ఈ పాటలో నువ్వు చంపేసావ్. ఎంత చేయాలో అంతా చేశావ్. ఇది తిరుగుబాటు చర్యనా?, వ్యూహాత్మక ఎత్తుగడనా లేదా "F*ck, నేను చేస్తాను" అని మీరు భావించినందున చేసిన పాటనా?'' అని కరణ్ ప్రశ్నించగా.. సామ్ వెంటనే ''థర్డ్ ఆప్షన్. F*ck.. నేను చేస్తాను" అని బదులిచ్చింది.
"నిజానికి ఈ పాట మగ చూపులపై సెటైర్ గా ఉంటుంది. అది మగవారి చూపులపైకి వస్తుందికాబట్టి చాలా విమర్శలు ట్రోలింగ్ వచ్చింది. కానీ నాచ్ గర్ల్ గా చేస్తున్న నా లాంటి పెద్ద స్టార్ కాకపోతే మగ చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరు?" అని సమంత చెప్పింది. "ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రాజి పాత్ర ఒక కారణం కోసం శారీరక పోరాటంలో పాల్గొంటుంది. ఇక్కడ 'ఊ అంటావా' ఒక స్టేట్మెంట్ ఇస్తుంది" అని చెప్పుకొచ్చింది.
"స్టేటమెంట్ ఇస్తున్నా.. లేదా ప్రపంచానికి నీ మిడిల్ ఫింగర్ చూపిస్తున్నా.. నువ్వు ఈ పాటలో చాలా హాట్ గా ఉన్నావ్" అని కరణ్ జోహార్ అన్నారు. ఇప్పుడు KwK షోలో సామ్ స్టేట్మెంట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం గురించి ఓ బాలీవుడ్ మీడియా రాసిన ఆర్టికల్ ను సామ్ ట్విట్టర్ లో షేర్ చేయడం గమనార్హం.
నిజానికి సమంత లాంటి అగ్ర కథానాయిక ఒక ఐటమ్ సాంగ్ చేయడమేంటని అభిమానులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ విడాకుల ప్రకటన తర్వాత కమిటైన ప్రాజెక్ట్ కావడంతో అందరి దృష్టి పడింది. సాంగ్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మగబుద్ది వంకర అంటూ లిరిక్స్ రాసిన చంద్రబోస్ ను.. అందులో నటించిన సామ్ ను విపరీతంగా ట్రోల్ చేశారు. కొందరు మహిళలు పాలాభిషేకాలు కూడా చేసారు. అయితే సమంత 'ఊ అంటావా' పాట చేయడానికి ముందు చాలానే ఆలోచించినట్లు ఆమె తాజా స్టేటమెంట్ ని బట్టి అర్థం అవుతోంది.