Begin typing your search above and press return to search.
నాకు నచ్చిన సినిమాలనే చేస్తాను -సమంత
By: Tupaki Desk | 15 Oct 2017 1:30 PM GMTవారు చేసిన సినిమాతో ఏ మాయ జరిగిందో గాని సమంత - చైతు ఫైనల్ గా లవ్ తో కనెక్ట్ అయ్యి పెళ్లితో సెటైల్డ్ అయ్యారు. వారు చేసుకున్న పెళ్లి కూడా టాలీవుడ్ చరిత్రలో అలా ఉండిపోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పెళ్లి తర్వాత సమంత తన మ్యారేజ్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు తన ఆలోచనలను అనుభవాలను చెప్పుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఆనందపడుతున్న అమ్మడు ఎవరంటే.. నేనే అని చెప్పేస్తా.. ఎందుకంటే ప్రస్తుతం నా సంతోషానికి అవధులు లేవు. అక్కినేని వారి కోదలైనందుకు చాలా ఆనందపడుతున్నా. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం కన్నా అదృష్టం ఏం ఉంటుంది. అంతే కాకుండా అందరూ నా ఇష్టాలను చాలా ఇష్టపడుతున్నారు. అక్కినేని కోడలైన తర్వాత మార్పులు వస్తాయని నేను అనుకోను. ఎందుకంటే వారు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. సాదారణంగా ఒక హీరోయిన్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నపుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అనే ఒక అపోహ ఉంది. దాన్ని నేను బ్రేక్ చేయాలని అనుకుంటున్న. పెళ్లి తర్వాత కూడా నాకు నచ్చిన సినిమాలని మాత్రమే చేస్తా. అందులో ఎటువంటి మార్పు ఉండదు. నా ఫ్యామిలీ (అక్కినేని) కూడా నాకు ఫుల్ సపోర్ట్ తో ఉంది అని సమంత వివరించింది.
ఇక పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లి ప్లానింగ్ అంతా చైతుదే..ఇక రెండు సార్లు పెళ్లి చేసుకుంటామని కలలో కూడా అనుకోలేదు. ఏ మాయ చేసావే సినిమాలో కూడా మేము రెండు సార్లు పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అదే నిజమైంది. బహుశా దేవుడు కనెక్ట్ చేసి ఉంటాడని చెప్పుకొచ్చింది.ఇక తన లవ్ స్టొరీ సినిమా గా తియ్యడం ఓకేనా అంటే.. నో కండిషన్ అంటోంది సమంత. ఇక హానిమూన్ గురించి ఏమి అనుకోలేదని చెబుతూ.. ప్రస్తుతం సావిత్రి సినిమా షూటింగ్ ఫినిష్ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నానని సమంత సమాధానం ఇచ్చింది.