Begin typing your search above and press return to search.

పెళ్ళి అనగానే ఆఫర్లు రావట్లేదు - సమంత

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:00 AM GMT
పెళ్ళి అనగానే ఆఫర్లు రావట్లేదు - సమంత
X
''ఈ సంవత్సరం ఆల్రెడీ అ..ఆ.. 24.. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ హిట్లలో నేను భాగమయ్యాను. అయినాసరే ఇప్పుడు నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కేవలం నా పెళ్లి గురించి ప్రకటించగానే.. ఆఫర్లన్నీ ఊష్‌ ఫటాక్ అయిపోయాయ్'' అంటోంది సెక్సిణి సమంత. అభినయం కమ్ అందచందాలతో మతిపోగొట్టే ఈ సుందరాంగి.. అసలు తన దగ్గరకు ఒక్క తెలుగు సినిమా ఆఫర్ కూడా రావట్లేదని చెప్పడం నిజంగానే షాకింగ్. ప్రముఖ దినపత్రిక డెక్కన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్యూలో అమ్మడు ఈ విధంగా పేర్కొంది.

''నాగార్జున కోడలు కదా.. ఎందుకులే.. అనుకుంటున్నారు కొందరు. సినిమాల్లో కంటిన్యూ అవుతానని నేను చెప్పాను.. చైతన్య చెప్పాడు.. నేను సినిమాలు ఎక్కడ మానేస్తానోనని ఫీలైన నాగార్జున గారు కూడా సినిమాలు చేయమనే చెప్పారు. ఫ్యామిలీకి ప్రాబ్లమ్ లేనప్పుడు ఇక ఈ నిర్మాతలకూ దర్శకులకూ ప్రాబ్లమ్ ఏంటో?? సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు కూడా తగ్గిపోయాయ్. అవి కూడా ఇవ్వట్లేదు'' అంటూ వాపోయింది సమంత. వచ్చే సంవత్సరం చివర్లో తమ పెళ్ళి జరుగుతుందని.. మరి సినిమాల్లో కంటిన్యూ అవ్వడానికి తాను రెడీగానే ఉన్నానని.. కాని ఫిలిం ఇండస్ర్టీ ఎలా రియాక్ట్ అవుతుందో తనకు తెలియదని చెప్పింది.

''పోనివ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా.. నాకు మాత్రం చాలామంచి ఫ్యామిలీ దొరికింది. ఇండస్ర్టీలో నా ఫ్యూచర్ గురించి తెలియదు కాని.. ఫ్యామిలీలో నా ఫ్యూచర్ మాత్రం అద్భుతంగా ఉండబోతోంది'' అంటూ ముగించింది సమంతం!!