Begin typing your search above and press return to search.

బొమ్మాళి.. గాఢనిద్ర నుంచి ఇప్పుడే లేచా కాచుకో!!

By:  Tupaki Desk   |   22 April 2020 7:10 AM GMT
బొమ్మాళి.. గాఢనిద్ర నుంచి ఇప్పుడే లేచా కాచుకో!!
X
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలు కొంతమంది.. యాక్టివ్ గా ఉండని సెలబ్రిటీలు కొంతమంది. అసలు సోషల్ మీడియాలోనే లేని సెలబ్రిటీలు మరికొంతమంది. అయితే సమంతా అక్కినేని మాత్రం సోషల్ మీడియాను శ్వాసిస్తుంది. మొదటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. తరచుగా అప్ డేట్ లు ఇవ్వడం.. మధ్య మధ్యలో హాట్ ఝలక్ లు ఇస్తూ కొందరు అక్కినేని అభిమానులను కాస్త చిరాకు పెట్టడం.. ఎవరైనా విమర్శిస్తే మధ్య వేలు.. చూపుడు వేలు.. ఉంగరం వేలు అన్నీ కలిపి చూపించడం.. ఇలా ఎంతో స్పైసీగా సాగుతూ వచ్చింది ప్రయాణం. కానీ గత కొన్ని రోజులుగా శ్యామ్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేదు.

దీంతో సమంతా ప్రస్తుతం సోషల్ మీడియా డీటాక్సిఫికేషన్ లో ఉందని.. అందుకే సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టకుండా దూరంగా ఉందని కొందరు అన్నారు. కొందరేమో ఎప్పటిలాగే సమంతా తల్లి కాబోతుందని కూడా అన్నారు. అయితే ఏది నిజమో ఇప్పటివరకు తెలియదు. వాటికి క్లారిటీ తర్వాత వస్తుంది కానీ సమంతా మాత్రం తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక ఫోటో పోస్ట్ చేసి "బ్యాక్ ఫ్రమ్ మై లాంగ్ స్లీప్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని మనం సినిమా స్టైల్ లో సినిమావాదం చేసుకుంటే "బొమ్మాళి.. గాఢనిద్ర నుంచి ఇప్పుడే లేచా. ఇక మిమ్మల్ని వదల" అవుతుంది. ఈ ఫోటోలో సమంతా సోఫాలో పడుకొని పెంపుడు కుక్క మీద చేయి వేసింది.

అసలే సమంతా కి ఫ్యాన్స్ ఎక్కువ.. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 500 లైక్స్ దాటాయి. సమంత తిరిగి యాక్టివ్ కావడం పట్ల అభిమానులు తమ హర్షం ప్రకటించారు. ఇంతకీ ఈ ఫోటో ఎవరు తీసుకుంటారో కనుక్కోండి? ఇంకెవరు టాలీవుడ్ జెంటిల్మేన్ చైతు అయి ఉంటాడు. అందులో అనుమానం ఎందుకు?