Begin typing your search above and press return to search.

సమంతాలాగా మారాలంటే

By:  Tupaki Desk   |   11 Jan 2018 1:23 PM IST
సమంతాలాగా మారాలంటే
X
దేవుడు సృష్టిలో ఎన్ని అందాలు ఇచ్చినా అవన్నీ అమ్మాయి అనే అపురూపం తర్వాతే. అందరు మెచ్చే లావణ్యంతో - అందంతో కనిపించాలని, మురిసిపోవాలని అనిపించని వారు ఎవరుంటారు. అందులోనూ సినిమా హీరొయిన్స్ తో పోల్చుకుని అలా ఉండాలని ప్రయత్నించే వాళ్ళు మనలో ఎక్కువగా కనిపిస్తారు. అలాంటివారి కోసం యాపిల్ బ్యూటీ సమంతా ఒక చిట్కా చెబుతోంది. నిగనిగలాడే చర్మ సౌందర్యం కావాలంటే యాపిల్ సిడర్ వెనిగర్ వెంటనే కొనమని చెబుతోంది. ఏం చేయాలి అని ప్రశ్నిస్తే అందులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అది ఎలా తీసుకోవాలో గూగుల్ తల్లిని అడిగితే వీడియోలతో సహా చూపిస్తుంది అని గడుసు సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా ఈ యాపిల్ సిడర్ వెనిగర్ ను ఉదయం పరగడుపున అంటే ఏమి తినకుండా తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతోంది.

యాపిల్ సిడర్ వెనిగర్ తో ఇంకా చాలా ఉపయోగాలు - రేసిపీలు ఉన్నాయని చెబుతున్న సమంతా ఆలస్యం చేయకుండా వెంటనే నెట్ లోకి వెళ్లి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోమని అమ్మాయిలకు పిలుపు ఇస్తోంది. భలే ఉంది కదూ. అచ్చం సమంతా లాగా మారే అవకాశం లేకపోయినా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రానున్న వరస సినిమాలతో హడావిడి చేయనున్న సమంతా అభిమన్యుడు - రంగస్థలం - మహానటి - యు టర్న్ సినిమాలతో తన ఫాన్స్ కు ఈ సంవత్సరం ఫుల్ మీల్స్ పెట్టనుంది.