Begin typing your search above and press return to search.
సామ్ కి పిచ్చిగా నచ్చేసిన నటుడు
By: Tupaki Desk | 28 Oct 2019 2:19 PM GMTఅందరూ సమంతను ఫేవరెట్ స్టార్ అని వెంటపడుతుంటారు. అలాంటిది తన ఫేవరెట్ ఎవరో చెప్పకనే చెప్పేసింది సమంత. ఒక గొప్ప సినిమా చూశాను అంటూ హాలీవుడ్ సినిమా `జోకర్` గురించి ప్రశంసలు కురిపించిన సామ్ ఆ చిత్రంలో జాక్విన్ ఫోనిక్స్ నటన పీక్స్ అంటూ కితాబిచ్చేసింది. అతడిని ఫేవరెట్ స్టార్ గా వోన్ చేసుకుంటూ ఎంతో ఎమోషన్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడిని ఆకాశానికెత్తేసింది. ఈ చిత్రంపై సమంత మాట్లాడుతూ-``జోకర్ గ్రేట్ సినిమా. ఇటీవల కాలంలో నేను చూసిన గొప్ప చిత్రమిది. జాక్విన్ ఫోనిక్స్ నటన చిరస్మరణీయం`` అని ప్రశంసలు కురిపించింది.
గ్లాడియేటర్ చిత్రంలో విలన్ గా నటించిన ఫోనిక్స్ ఇంతకుముందు భారీ ఫిక్షన్ యాక్షన్ చిత్రం బ్యాట్ మ్యాన్ సిరీస్ లోనూ నటించాడు. అక్కడ పుట్టిందే జోకర్ పాత్ర. బ్యాట్ మ్యాన్ సిరీస్ సినిమాల్లో విలన్ (జోకర్) గా జాక్విన్ ఫోనిక్స్ ఇరగదీశాడన్న ప్రశంసలు దక్కాయి. బ్యాట్ మ్యాన్ లోని విలన్ పాత్ర స్ఫూర్తితోనే `జోకర్` ఫుల్ లెంథ్ సినిమా తీశారు దర్శకుడు టాడ్ ఫిలిప్స్. ఒక రకంగా బ్యాట్ మ్యాన్ సిరీస్ కి ప్రీక్వెల్ సినిమా ఇది. టాడ్ ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా అద్భుతంగా మలిచారన్న ప్రశంసలు దక్కాయి. తన జీవితంలో ఎదురైన కొన్ని కఠోర పరిస్థితుల్లో జోకర్ విలన్ గా మారిన క్రమంలో ఏం జరిగింది అన్నదే సినిమా కథాంశం.
జోకర్ చిత్రం కల్ట్ క్లాసిక్ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం 2020 ఆస్కార్ బరిలో అవార్డులు కొల్లగొట్టడం ఖాయమన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 850 మిలియన్ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇండియాలోనూ మల్టీప్లెక్సుల నుంచి భారీగా వసూళ్లను సాధించింది. సైరా చిత్రం రిలీజైన రోజున వార్ తో పాటుగా రిలీజై మల్టీప్లెక్సుల్లో జోకర్ చిత్రం ఠఫ్ కాంపిటీషన్ ఇచ్చింది.