Begin typing your search above and press return to search.
హాట్ లుక్: అగ్గి రాజేసిన అక్కినేని కోడలు
By: Tupaki Desk | 3 July 2021 4:44 PM GMTఅక్కినేని కోడలు సమంత టైమ్ నడుస్తోంది. తాను ఏం చేపట్టినా అది బంగారంగా మారుతోంది. ఓబేబి- మజిలీ లాంటి బ్లాక్ బస్టర్లతో సత్తా చాటి అటుపై ఓటీటీలో సామ్ జామ్ ప్రోగ్రామ్ ని విజయవంతంగా నడిపించిన కోడలి పిల్లగా తెలుగు వారి గుండెల్లో నిలిచింది. సాటి కథానాయికలు ఎవరికీ సాధ్యం కాని రీతిలో వెబ్ సిరీస్ లతోనూ సంచలనాలకు తెర తీస్తున్నారు సమంత. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 బంపర్ హిట్ అవ్వడం వెనక సామ్ ట్యాలెంట్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కింది. ఇక నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటీటీతో భారీ డీల్ కుదుర్చుకుని సమంత మరో లెవల్ కి చేరుకుంటున్నారు. ప్రతిభ ఉంటే వేదిక ఏదైనా ఒకటే అని సమంత నిరూపిస్తున్నారు.
అక్కినేని కోడలా మజాకానా! అనేంతగా చెలరేగుతున్నారు. ఇక సోషల్ మీడియాల్లోనూ సామ్ ప్రకంపనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సామ్ వేడి పెంచేస్తున్నారు. సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. నేవీ బ్లూ జీన్స్.. దానికి కాంబినేషన్ గా వైట్ డిజైనర్ టాప్ లో టాప్ లేపేసిన సామ్ కిల్లర్ లుక్ తో కట్టి పడేస్తున్నారు. సమంత స్ట్రైకింగ్ ఫోజ్ బోయ్స్ ని కిల్ చేయడం ఖాయం. అలా వీపందాన్ని ఆవిష్కరించిన తీరుకు మంత్రముగ్ధం అయిపోతున్నారంతా. సామ్ ఈ ఫోటోకి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు. ``మీరు జీవితంలో అధిగమించడం అసాధ్యమని అనిపించిన అన్ని విషయాల గురించి ఆలోచించండి. ఇంకా మీరు ఇక్కడ(భూమిపై) ఉన్నారు .. ఒక సర్వైవర్`` అంటూ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత తన జీవితంలో రెండు విషయాలు మిస్ అవుతున్నాను అని అన్నారు. తమిళనాడులో జన్మించిన సమంత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ అయ్యింది. అక్కినేని కోడలు అయ్యాక హైదరాబాద్ కు షిఫ్టవ్వాల్సి వచ్చింది. అయితే తనకు బీచ్ లు లేని నగరంలో ఎలాంటి ఇబ్బందో తనే స్వయంగా చెప్పింది. అనేక పుట్టినరోజు పార్టీలు.. తన మొదటి ఫోటో షూట్ .. అనేకానేక వేడుకలకు చెన్నై మెరీనా బీచ్ తన కేంద్రంగా ఉండేదని సామ్ జ్ఞాపకాల్ని పంచుకున్నారు. అయితే ఇలాంటివి ఇక్కడా కొనసాగించడానికి హైదరాబాద్ లో బీచ్లు లేవని చెప్పారు. ఉదయాన్నే చెన్నైలో తనకు లభించే ఆహారం హైదరాబాద్ లో లేదని కూడా అన్నారు.