Begin typing your search above and press return to search.
సమంత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి
By: Tupaki Desk | 12 Feb 2020 2:18 PM GMTనాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ ప్రచారం జరిగింది. మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలను పట్టించుకోకుండా చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత వరుసగా చిత్రాలు చేస్తూ ఆ పుకార్లకు సమాధానం చెబుతూ వచ్చింది. తాజాగా జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. జాను చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ రెండు మూడు సంవత్సరాల తర్వాత సినిమాలు చేయనంటూ చెప్పుకొచ్చింది అంటూ గత రెండు మూడు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమంత నటిస్తూనే ఉండాలంటూ ఫ్యాన్ కోరుతున్నారు. తన గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత స్వయంగా స్పందించింది. నా మాటలను అపార్థం చేసుకున్నారని ఇండస్ట్రీ లో ఒక హీరోయిన్ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని కాని నేను ఇంత కాలం హీరోయిన్ గా చేస్తుండటం సంతోషంగా ఉంది.
నేను మద్యలో గ్యాప్ తీసుకున్న మళ్లీ సినిమాలు చేస్తాను. ఒక వేళ హీరోయిన్ గా ఆఫర్లు రాకుంటే ఏదో ఒక రకంగా సినిమాల్లో కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏదో రకంగా అంటే నిర్మాతగా కూడా అయ్యి ఉండవచ్చు అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి సమంత తన అభిమానులకు అన్యాయం చేయదని.. ఆమె సినిమాల్లో కొనసాగనుందని క్లారిటీ రావడంతో వారు ఊపిరి పీల్చుకోవచ్చు.