Begin typing your search above and press return to search.

స‌మంత స‌ర‌స‌న ఆ హిందీ హీరో ఎవ‌రు?

By:  Tupaki Desk   |   5 July 2020 8:00 AM GMT
స‌మంత స‌ర‌స‌న ఆ హిందీ హీరో ఎవ‌రు?
X
టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్న స‌మంత కోలీవుడ్ లోనూ స్టార్ డ‌మ్ ని అందిపుచ్చుకుంది. ప్ర‌స్తుతం సామ్ ప్లాన్ ఛేంజ్ చేసి బాలీవుడ్ లో అడుగు పెడుతోందా? అంటే అవున‌నే ఓ స‌మాచారం లీకైంది. మ‌ణిర‌త్నం లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సామ్ ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేయాల‌ని చూసినా అప్ప‌ట్లో కుద‌ర‌లేదు. `ఏక్ దీవానా థా` చిత్రంలో స‌మంత న‌టిస్తోంద‌ని చాలా కాలం క్రితం ప్ర‌చార‌మైనా అది సాధ్య‌ప‌డ‌లేదు.

ఆ త‌ర్వాత సామ్ ని ముంబై ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసేందుకు ప‌లుమార్లు ప్ర‌య‌త్నాలు సాగాయి. కానీ ఏడాదికి స‌రిపడా సినిమాల‌తో సౌత్ లోనే నిరంత‌రం బిజీగా ఉంటున్న స‌మంత హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లేందుకు ఆసక్తిగా లేన‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించింది. ఆ క్ర‌మంలోనే త‌న గురువు గారు.. ఏమాయ చేశావే ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ప్రోద్బ‌లంతో బెట్టు వీడి సామ్ హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్లేందుకు అంగీక‌రించింది. అత‌డు తెర‌కెక్కిస్తున్న తాజా త్రిభాషా చిత్రంలో సామ్ న‌టిస్తోంది. ఈ మూవీ హిందీ వెర్ష‌న్ లో ట్యాలెంటెడ్ ఆదిత్యారాయ్ క‌పూర్ స‌ర‌స‌న సామ్ న‌టించ‌నుంది.

15-25 సంవత్సరాల వయస్సు యువ‌తీ యువ‌కుల పరివర్తన.. ప్రేమ‌క‌థ‌ల ఆధారంగా రూపొందిస్తున్న చిత్ర‌మిది. గౌతమ్ సార్ ఈ పాత్రను నాకు అవ‌కాశం క‌ల్పించారు. మూడు భాషలలో క‌థానాయిక‌ను అనుకున్న‌ప్పుడు హిందీలో కూడా త‌ననే హీరోయిన్ గా ఎంపిక చేశార‌ట‌. ``ఆయ‌న కావాల‌నుకోవ‌డం వ‌ల్ల‌నే దీన్ని అంగీకరించాను. నేను గౌత‌మ్ తీర్పును విలువైనదిగా భావిస్తున్నాను. తను చెప్పేది నాకు మంచిది. అతను నా గురువు`` అంటూ సామ్ ఎమోష‌న‌ల్ అయ్యింది ఓ ఇంట‌ర్వ్యూలో. అయితే గౌత‌మ్ మీన‌న్ ప్ర‌తిసారీ బ‌హుభాషా చిత్రాలతో అధిక భారం మోస్తూ ఇన్ టైమ్ లో వాటిని పూర్తి చేయ‌లేక‌పోవ‌డం విడుద‌ల‌కు నోచుకోక‌పోవ‌డం అన్న‌ది స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. ప్ర‌స్తుత క్రైసిస్ స‌మ‌యంలో సామ్ బాలీవుడ్ డెబ్యూ ఆల‌స్యం కావ‌డానికి కార‌ణ‌మిదే.