Begin typing your search above and press return to search.

వదినా అండ్ మరిది.. ఓపెన్ చేశారండీ..

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:34 AM GMT
వదినా అండ్ మరిది.. ఓపెన్ చేశారండీ..
X
ఏదైనా ఓ బ్రాండ్ కి కుటుంబ సభ్యులు కలిసి ప్రచారం చేస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పటికే స్టార్ కపుల్ ని పెట్టి తీసిన యాడ్స్.. బాగానే క్లిక్ అయ్యాయి. అలాగే ఇద్దరేసి స్టార్స్ తో కూడా యాడ్స్ తీస్తూ ఉంటారు. కానీ ఓ యాడ్ కి పని చేసిన ఇద్దరు సడెన్ గా బంధువులు అయిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఒకే చోట కనిపించే సందర్భం వచ్చింది.

సౌతిండియా షాపింగ్ మాల్ కు.. సౌత్ బ్యూటీ సమంతతో పాటు.. కుర్ర హీరో అఖిల్ కూడా బ్రాండ్ అంబాసిడర్. అయితే.. ఇప్పుడు అఖిల్ అన్నయ్య నాగచైతన్యతో సమంత వివాహం జరగనుందనే టాక్ ఉంది. ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. దాసరి లాంటి దిగ్గజాలు కూడా క్లూస్ ఇచ్చేస్తున్నారంటే ఇక అనుమానించాల్సింది ఏమీ ఉండదు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ మ్యారేజ్ కారణంగా.. సమంత-అఖిల్ లు.. వదినా-మరిదులు కానున్నారు. రీసెంట్ గా ఈ బ్రాండ్ కి చెందిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి... సమంత-అఖిల్ ఇద్దరూ రావడం చాలామందికి ఆసక్తి కలిగించింది.

సమంత రిబ్బన్ కట్ చేస్తే.. పక్కనే ఉన్న అఖిల్ ఆసక్తిగా చూస్తున్నాడు. కట్ చేయడం అయిపోయాక చప్పట్లు కొట్టాడు. కాసేపు.. వదినా మరిదిలు షాపింగ్ మాల్ అంతా చక్కర్లు కొట్టారు. ఫోటోలకు పోజులిచ్చారు. అయితే.. ఇలా వదినామరిదులు కలిసి ఓ బ్రాండ్ కి ప్రచారం చేయడం మాత్రం.. ఇదే మొదటి సారి కానుంది.