Begin typing your search above and press return to search.

తొలి రేయిపై ఆలియా అలా చెబితే సామ్ ఇలా!

By:  Tupaki Desk   |   9 July 2022 5:18 AM GMT
తొలి రేయిపై ఆలియా అలా చెబితే సామ్ ఇలా!
X
పెళ్లి త‌ర్వాత ఏ యువ‌తి అయినా మొద‌టి రేయి అనుభ‌వం గురించి బాహాటంగా ఓపెన‌వుతుందా? .. కానీ ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా ఎంతో బాహాటంగా ల‌క్ష‌లాది మంది వీక్షించే ఓ ప‌బ్లిక్ వేదిక‌పై త‌న శోభ‌నం గురించి ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా మాట్లాడి ఆశ్చ‌ర్య‌పరిచింది ఆలియాభ‌ట్.

త‌న కోస్టార్ ర‌ణ‌వీర్ ముందే తొలి రేయి గురించి ఆలియా భ‌ట్ ప్ర‌స్థావించిన తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి హ‌డావుడిలో న‌వ‌దంప‌తులు పూర్తిగా అల‌సిపోతారు. మేం కూడా అల‌సిపోయాం. అందువ‌ల్ల సుహాగ్రాత్ (తొలిరేయి) జ‌ర‌గ‌లేదు! అంటూ బ‌హిరంగంగా అంగీక‌రించింది ఆలియా భ‌ట్. త‌న‌కు అలా జ‌రిగినా కానీ ర‌ణ వీర్ -దీపిక జంట‌కు అలా జరిగి ఉండ‌ద‌ని కూడా అంది. అంతేకాదు.. త‌న భ‌ర్త ర‌ణ‌బీర్ మాజీ ప్రియురాళ్ల‌తో తాను స్నేహంగా ఉంటానని అత‌డికి ఇత‌ర అమ్మాయిల‌తోనూ సంబంధాలున్నా త‌న‌కు మాత్రం తెలియ‌ద‌ని కూడా ఆలియా బోల్డ్ గా వ్యాఖ్యానించింది. కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7లో క‌ర‌ణ్ జోహార్ సాక్షిగా ఇవ‌న్నీ ఆయ‌న శిష్యురాలైన ఆలియా బ‌య‌ట‌పెట్టేసింది.

కాఫీ విత్ కరణ్ 7 లో రణబీర్ కపూర్ తో తన స్టీమీ బెడ్ రూమ్ రహస్యాలను ఆలియా భట్ వెల్లడించింది. పెళ్లి అయిన నెల‌రోజుల‌కే ఆలియా తాను గ‌ర్భ‌వ‌తిని అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆలియా- ర‌ణ‌బీర్ దంప‌తులు మ‌మ్మీ -డాడీ కాబోతున్నారు. అలాగే షోలో ఆలియా కో స్టార్ రణవీర్ 2018లో దీపికా పదుకొణెను వివాహం చేసుకున్నారు. దీపిక కూడా గ‌ర్భిణి అన్న గుస‌గుస వినిపించింది. కానీ అధికారికంగా ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది.

ఈ సీజన్ లో అలియా -ర‌ణ్ వీర్ కాకుండా, సమంతా రూత్ ప్రభు- అక్షయ్ కుమార్.. టైగర్ ష్రాఫ్- సారా అలీ ఖాన్- జాన్వీ కపూర్ త‌దిత‌రులు క‌ర‌ణ్ తో క‌లిసి కాఫీ తాగ‌నున్నారు. ఆలియా ఎపిసోడ్ జూలై 7న రాత్రి 7 గంటలకు డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయ్యింది. ఆరంభం అదిరింది. క‌ర‌ణ్‌ తన బ్లాక్ బ‌స్ట‌ర్ చాట్ షో కొత్త సీజన్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు.

18 సంవత్సరాలకు పైగా సెలబ్రిటీ ఇంట‌ర్వ్యూల‌తో కాఫీ విత్ క‌ర‌ణ్ అల‌రిస్తోంది. సరికొత్త సీజన్ కోసం క‌ర‌ణ్ భారీ ప్లానింగ్ తో ముందుకు సాగాడు. ఈసారి సౌత్ స్టార్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. స‌మంత‌తో ఎపిసోడ్స్ ప్ర‌ధానంగా హైలైట్ కానున్నాయి. ఇక ఇంత‌కుముందే వైర‌ల్ అయిన టీజ‌ర్ లో స‌మంత కే3 జి .. కేజీఎఫ్ అంటూ ఫ్యామిలీ లైఫ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

క‌ర‌ణ్ తెర‌కెక్కించిన క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్ త‌ర‌హా అనుబంధాలు ఇప్పుడు లేవ‌ని కూడా సామ్ సెటైర్ వేసింది. వివాహ బంధాలు కుప్ప‌కూల‌డానికి క‌ర‌ణ్ కార‌ణ‌మ‌ని ఫ‌న్నీ నోట్ తో చెప్పింది. ఇప్ప‌టికే టీజ‌ర్లు వేడెక్కించాయి. ఇక న‌టీన‌టుల ఎఫైర్లు.. రొమాన్స్.. రిలేష‌న్ షిప్స్ వ‌గైరా అంశాలు ఈ వేదిక‌పై హీట్ పెంచుతున్నాయి.