Begin typing your search above and press return to search.

సమంత పార్టీ అక్కడ జరుగుతోందా!!

By:  Tupaki Desk   |   29 Dec 2016 12:14 PM GMT
సమంత పార్టీ అక్కడ జరుగుతోందా!!
X
మొన్నటివరకు అసలు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేసింది సమంత. తన బికినీ ఫోటోలతో.. వాటిపై ఛలాకి కామెంట్లతో ఊరించేసింది. ఒక్కసారిగా టాలీవుడ్ అంతా త్వరలో పెళ్ళికూతురు కాబోతున్న ఈ హాటీ తాలూకు నాటీ యాక్ట్స్ అన్నీ చూసి షాకైందనే చెప్పాలి. అయితే ఇంతకీ సమంత ఎక్కడున్నట్లు?

ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం.. నాగ చైతన్య స్నేహితులు ద్వారా తెలిసింది. ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలసి ఇప్పుడు మాల్డీవులు వెళ్ళారట. అక్కడి నుండి సమంత ఆ ఫోటోలను పెట్టింది. న్యూ ఇయర్ వేడుకులను అక్కడే జరుపుకుని.. ఫుల్లుగా పార్టీయింగ్ చేసుకుని.. అప్పుడు ఇండియా తిరిగొస్తారట. మొత్తానికి సమంత అండ్ నాగ చైతన్య టాలీవుడ్ లోనే టాప్ పార్టీ బర్డ్స్ అని చెప్పాలి. గతంలో హైదరాబాద్ లో.. అలాగే బ్రస్సెల్స్ లో ఒక మ్యూజిక్ ఈవెంట్.. ఇలా ఇద్దరూ పార్టీలంటే చాలు.. ఫస్టు ఎస్ చెప్పేస్తున్నారు.

ఇకపోతే ఒకవేళ సమంత గత సంవత్సరం టైపులో గోవాలో ఉందేమో.. అక్కడకెళ్ళి హాయ్ చెబుదాం అనుకున్న అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం.. ఆమె మాల్డీవ్స్ లో ఉందని తెలుసుకుని కాస్త నిరాశచెందాల్సిందే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/