Begin typing your search above and press return to search.
చైతు-సమంత.. పెళ్లి ప్లాన్ మారిపోయిందా?
By: Tupaki Desk | 27 Dec 2016 1:20 PM GMTఅక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య-సమంతలకు.. అఖిల్-శ్రేయాభూపాల్ లకు వివాహాలు ఫిక్స్ అవడమే కాదు.. ఇప్పటికే అఖిల్ నిశ్చితార్ధం కూడా పూర్తయిపోయింది. జనవరి 29న చైతు-సమంతల ఎంగేజ్మెంట్ జరగనుందనే వార్తలు కూడా వచ్చాయి.
రియల్ లైఫ్ హీరోహీరోయిన్స్ గా మారుతున్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి ప్రణాళికలో మార్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది జూన్ తర్వాత చైతు-సమంత వివాహం జరుగుతుందన్నారు. కానీ ఇప్పుడు దీన్ని ప్రీపోన్ చేస్తున్నారట. మార్చ్-ఏప్రిల్ లోనే వీరి వివాహం జరిగిపోనుందని తెలుస్తోంది. చిన్నవాడైన అఖిల్ పెళ్లి మే నెలలో జరగనుండగా.. ఆ తర్వాత పెద్దవాడైన చైతు పెళ్లి జరగడం కరెక్ట్ కాదనే సలహాలు అక్కినేని కుటుంబానికి అందాయట.
దీంతో అఖిల్-శ్రేయల కంటే ముందే పెళ్లి చేసుకోవాల్సిందిగా చైతు-సమంతలకు అక్కినేని ఫ్యామిలీ నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. ఈ సూచనకు వారి నుంచి కూడా ఇప్పటికే అంగీకారం వచ్చేసిందని అంటున్నారు. జనవరిలో నిశ్చితార్ధం.. మార్చ్-ఏప్రిల్ లలో పెళ్లి.. చైతు-సమంతల పెళ్లి పనులు ఇక బాగా స్పీడ్ అందుకున్నట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/