Begin typing your search above and press return to search.

సమంతా ఎక్కడా తగ్గడం లేదు

By:  Tupaki Desk   |   1 Jan 2018 6:38 AM GMT
సమంతా ఎక్కడా తగ్గడం లేదు
X
టాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ అండ్ క్యూట్ హీరొయిన్ ఎవరు అనే ప్రశ్న వస్తే ముందు గుర్తుకు వచ్చే పేరు సమంతానే. అక్కినేని కోడలు అయ్యాక తన స్పీడ్ తగ్గుతుంది అనుకున్నారు కాని సాం మాత్రం ముందు చెప్పినట్టే తన కెరీర్ కి ఏ మాత్రం బ్రేకులు లేకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. పెళ్లి జరిగాక బయట కాస్తంత ట్రెడిషనల్ టచ్ తో ఉన్న డ్రెస్సింగ్ తో డీసెంట్ గా కనిపిస్తున్న సమంతాలో చాలా మార్పు వచ్చిందే అనుకున్నారు అభిమానులు. కాని సందర్భానికి తగ్గట్టే తాను ఉంటాను తప్ప ఒరిజినల్ గా తనలో ఏ మార్పు రాదని న్యూ ఇయర్ సందర్భంగా తన భర్త నాగ చైతన్యతో తీసుకున్న పిక్ ద్వారా మరోసారి ఋజువు చేసింది.

లైఫ్ పార్టనర్ చైతుతో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన పిక్ ఒకటి షేర్ చేసింది సాం. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా. విశేషం అంతా తను వేసుకున్న డ్రెస్ లో ఉంది. చాలా క్యాజువల్ అవుట్ ఫిట్ తో స్లీవ్ లెస్ టాప్ తో క్లీవేజ్ కనిపించేలా ఇచ్చిన స్టిల్ కి ఫాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. హమ్మయ్య సమంతా మారలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పక్కన నాగచైతన్య చాలా ఠీవిగా ఎతినిక్ వేర్ లో ఉన్నప్పటికీ తన వైపు ఎవరు చూడటం లేదు. కాని ఎక్కడికి వెళ్ళినా పోటీ పడుతూ మరీ ఇద్దరు మైంటైన్ చేస్తున్న డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మోస్ట్ లవబుల్ కపుల్ అఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా ఇప్పటికే అనఫిషియాల్ బిరుదు కూడా అందుకున్నారు ఇద్దరు.

సమంతా నటించిన అభిమన్యుడు - మహానటి - రంగస్థలం మూడు సినిమాలు కేవలం రెండు నెలల(జనవరి 26-మార్చ్ ౩౦) వ్యవధిలో రానుండటం తన ఫాన్స్ పండుగ అని చెప్పుకోవచ్చు. ఇటీవలే జీ తెలుగు ఛానల్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఒప్పందం కూడా చేసుకున్న సమంతా అప్పుడే ఆ ఛానల్ లో యాడ్స్ రూపంలో సందడి చేయటం స్టార్ట్ చేసింది.