Begin typing your search above and press return to search.

ఎనిమిదేళ్ళ తరువాత అక్కడే చెయ్-శామ్

By:  Tupaki Desk   |   2 April 2018 4:40 AM GMT
ఎనిమిదేళ్ళ తరువాత అక్కడే చెయ్-శామ్
X
అక్కినేని నాగ చైతన్య- సమంత.. ఈ ఇద్దరి జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇద్దరూ సుదీర్ఘ కాలం ప్రేమించుకుని ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఒకరిపై ఒకరు కురిపించుకునే ప్రేమ అబ్బురపరుస్తుంది. అక్కినేని వారి ఇంటి కోడలిగా మారిన తర్వాత కూడా నటనను కంటిన్యూ చేస్తోంది సమంత.

రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన రామ్ చరణ్ మూవీ రంగస్థలం రిలీజ్ కాగా.. ఈ చిత్రంలో ఆమె నటించిన రామలక్ష్మి పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బోలెడన్ని ప్రశంసలను స్వీకరిస్తూ.. సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెబుతున్న సామ్.. ప్రస్తుతం అమెరికాలో చక్కర్లు కొడుతోంది. రంగస్థలం ప్రమోషన్స్ ను విడుదలకు ముందే పూర్తి చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన భర్తతో కలిసి సెంట్రల్ పార్క్ నుంచి ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఒకరిని ఒకరు హత్తుకుని తామిద్దరి మధ్య క్లోజ్ నెస్ ను చూపించడమే కాకుండా.. ఈ ఫోటోకు మరో ప్రత్యేకత ఉంది.

ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే పార్కులో.. ఇదే స్పాట్ లో ఏం మాయ చేశావే మూవీ షూటింగ్ జరిగింది. అది సమంతకు తొలి చిత్రం అయితే.. చైతుకు ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ అందించిన మూవీ. అక్కడ ప్రారంభమైన పరిచయం.. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రేమ.. ఇప్పుడు పెళ్లి వరకూ దారి తీసింది. ఆ క్షణాలను గుర్తు చేసుకుంటున్న చెయ్-సామ్ జంట.. మనకు కూడా వాటిలో కొన్నిటిని పంచుతున్నారు.