Begin typing your search above and press return to search.

సమంతా నయన్ ల స్ట్రెయిట్ ఫైట్

By:  Tupaki Desk   |   28 Feb 2019 12:50 PM GMT
సమంతా నయన్ ల స్ట్రెయిట్ ఫైట్
X
ఈమధ్య కాలంలో సౌత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. హీరో లేకపోయినా వీళ్ళ ఆధారంగా తీసే మూవీస్ లో కంటెంట్ ఉంటే చాలు జనం ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో నయనతార సమంతాలు వేర్వేరుగా నటించిన రెండు సినిమాలు మార్చ్ చివరి వారంలో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. అందులో మొదటిది నయనతార డ్యూయల్ రోల్ చేసిన హారర్ ఫ్లిక్ ఐరా కాగా రెండోది సమంతా నటించిన సూపర్ డీలక్స్.

ఐరా డేట్ మార్చ్ 28 ఫిక్స్ కాగా సూపర్ డీలక్స్ ఒక్క రోజు తేడాతో 29న రిలీజ్ కానుంది. తేడా చిన్నదే కాబట్టి ఇంచుమిందు నేరుగా క్లాష్ అవుతున్నట్టే పరిగణించాలి. రెండు జానర్లు వేరే అయినప్పటికీ పోటీ మాత్రం ఆసక్తికరంగా మారింది. మధ్యలో ధనుష్ గౌతమ్ మీనన్ ల కాంబో సినిమా రావొచ్చు అన్నారు కానీ దాని సూచనలు కనిపించడం లేదు. ఐరా మొత్తం భారాన్ని నయనతార భుజాల మీద వేసుకుని వస్తోంది. నలుపుగా ఉండే ఓ అమ్మాయి గ్లామర్ గా తెల్లగా ఉండే మరో పాత్రలో నయన్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని కోలీవుడ్ టాక్.

అయితే సమంతాకు ఈ రిస్క్ లేదు. సూపర్ డీలక్స్ లో తనతో పాటు విజయ్ సేతుపతి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. అంతే కాదు రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఐరా సూపర్ డీలక్స్ ట్రైలర్లు ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో నయన్ సమంతాల మధ్య క్లాష్ లో ఎవరు గెలుస్తారో అనే సస్పెన్స్ నెలకొంది. తెలుగులో కూడా అవే తేదీలకు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.