Begin typing your search above and press return to search.
పేరు తప్పురాస్తే ఉతికి ఆరేస్తారట
By: Tupaki Desk | 24 Sep 2015 4:26 AM GMTపేరులో ఏముంది.. నేముతో పనేముంది.. అంటూ ఓ సినిమాలో ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్ వినిపిస్తుంది. కానీ హీరోయిన్లు మాత్రం పేరునే కాదు.. అందులో ఒక్క అక్షరాన్ని తప్పు రాసినా తట్టుకోలేకపోతున్నారు. రుసరుసలాడుతున్నారు, వెటకారాలు ఆడుతున్నారు, తప్పులు సరిదిద్దేస్తున్నారు కూడా.
మిల్కీ బ్యూటీ తమన్నా తన పేరుకు చివర హెచ్ అనే అక్షరాన్ని తగిలించుకున్న విషయం తెలిసిన విషయమే. కరెక్ట్ గా ఇదే స్పెల్లింగ్ తో టైటిల్స్ పడేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మ్యాగజైన్ లకి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా.. ఈ విషయాన్ని పట్టి పట్టి మరీ గట్టిగానే చెబ్తోంది తమన్నా. సౌత్ ని ఏలుతున్న మరో సుందరాంగి సమంత సిట్యుయేషన్ కూడా ఇలాగే ఉంది. సమంత స్పెల్లింగ్ ని కరెక్ట్ గా స్పెల్ చేయలేదు ఓ క్రిటిక్. సమ్నత అని రాశాడతను. అంతే ఇలాంటి పేరుతో కొత్త హీరోయిన్ ఎవరైనా వచ్చిందా అంటూ అడిగేసింది. కామెడీగా వేసిన కౌంటర్ లా అనిపిస్తున్నా.. తప్పు రాస్తే తాట తీస్తా అన్నంత పదునున్న పంచ్ ఇది.
ఇక రకుల్ కూడా ఇలా ట్వీట్ తోనే స్పెల్లింగ్ ని కరెక్ట్ చేస్తోంది. ప్రీత్ స్పెల్లింగ్ లో ఒక హెచ్ ఎక్ స్ట్రాగా రాస్తే.. సరిదిద్దే వరకూ వదిలిపెట్టలేదు. చూస్తుంటే ఈ అమ్మాయిలందరికీ స్పెల్లింగ్ తో మంచి రిలేషన్ ఉన్నట్లుంది. న్యూమరాలజీ లెక్కలున్నాయనో.. లేక అర్ధాలేమన్నా మారిపోతాయని అనుకుంటున్నారో కానీ.. పేరు తప్పు రాస్తే మాత్రం గట్టిగానే వాయించేస్తున్నారు.