Begin typing your search above and press return to search.
మన హీరోయిన్లు ఇలా మారిపోయారేంటి?!
By: Tupaki Desk | 5 Nov 2015 3:30 PM GMTగ్లామర్ ప్రపంచంలో ఉన్న భామలు... ఎక్స్ పోజింగ్ గురించో, రిలేషన్స్ గురించి వార్తల్లో ఉండాల్సినవాళ్లు... హీరోయిన్లంటే అదే దృష్టితోనే చూస్తారంతా. తెరపై కనిపిస్తూ ఎంత వేడి పుట్టిస్తారా? మాటలతో ఎలాంటి అలజడి సృష్టిస్తారా? అంటూ ఆసక్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ మన భామలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మారిపోయారు. తెరపై గ్లామర్ లేదు, బయట మాటల్లోనూ వేడి కనిపించడం లేదు. మరీ గమ్మత్తేంటంటే ఆధ్యాత్మిక బాటలో వెళుతున్నవాళ్లలాగా వేదాంతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారి మాటల్ని చూసి ఈ నగరానికి ఏమైందన్నట్టుగా ఈ హీరోయిన్లకు ఏమైంది అని జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేసుకొంటున్నారు.
మొన్నటికి మొన్న సమంత మహాభారతంలోని కొటేషన్లను ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ సెట్టైర్లు వేస్తూ, ట్విట్టర్ లో ఎక్కువగా ఫ్యాషన్ గురించి ప్రస్తావిస్తూ గడిపే సమంత ఇలా వేదాంతం మాట్లాడటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కానీ సమంత కొంతకాలంగా వ్యక్తిగతంగా సమస్యల్ని ఎదుర్కొంటోంది. తన ఇంటిపై ఐటీ రైడ్స్ జరగడంతో పాటు, వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆమె ఆ కష్టాల నుంచి బయట పడేందుకు పుస్తక పఠనంపై దృష్టిపెట్టిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సూచనల మేరకే ఆమె ఇటీవల మహాభారతం చదువుతోందని ప్రచారం సాగుతోంది. సమంత పరిస్థితిఅలా ఉందా? అల్లరి పిల్లగా ముద్రపడ్డ స్వాతి కూడా అచ్చం సమంతలాగే వేదాంతం మాట్లాడుతోంది. `మనమేదో ఆవేశపడుతున్నాం, ప్రతీ శుక్రవారం జీవితం ఏమైపోతుందా అని టెన్షన్ పడుతున్నాం, అసలు ఈ ప్రపంచంలో మనమెంత? మనలాంటివాళ్లు సృష్టిలో బోలెడు మంది ఉన్నార`ని ఆధ్యాత్మిక వేత్తలాగా మాట్లాడుతోంది. ఇలా ఎప్పుడు జ్ఞానోదయం అయిందమ్మా అని అడిగితే... ``ఆమధ్య న్యూయార్క్ వెళ్లా. అక్కడి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో పిల్లల్ని చూశాక... మనలాంటివాళ్లు బోలెడుమంది ఉన్నారని ఆ క్షణమే అనిపించింద``ని చెప్పుకొచ్చింది స్వాతి. త్రిష కూడా తన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయినప్పుడు తనకి తానే ధైర్యం చెప్పుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్లే ఇచ్చింది. మొత్తంగా అందాల భామలకి జీవితం బాగానే అర్థమవుతున్నట్టు తెలుస్తోంది.