Begin typing your search above and press return to search.

అప్పుడే ఈ పెద్దరికం ఏంటి శ్యామ్!!

By:  Tupaki Desk   |   23 Jan 2017 8:10 AM GMT
అప్పుడే ఈ పెద్దరికం ఏంటి శ్యామ్!!
X
ఆమె ఒక స్టార్ హీరోయిన్. కాని ఎప్పుడైతే హీరో నాగ చైతన్యతో తన పెళ్ళి న్యూస్ కన్ఫామ్ చేసిందో.. వెంటనే తెలుగులో ఆఫర్లు పడిపోయాయ్. నాగార్జున గారి కోడలు కాబట్టి ఆఫర్లు కొందరు ఇవ్వట్లేదు.. ఇక పెళ్లయిన హీరోయిన్ మనకెందులకే అని కొందరు పక్కనెట్టేస్తున్నారు. కాని సమంత అండ్ చైతన్య అండ్ నాగ్ మాత్రం.. పెళ్ళయినా కూడా సమంత సినిమాల్లో నటించాలనే కోరుకుంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. ఈ మధ్యన ఎక్కువగా ఫ్యామిలీ ఈవెంట్లు అండ్ ఫ్రెండ్స్ పార్టీల్లో తెగ మెరుస్తోంది సమంత. ఆమె మోడ్రన్ డ్రస్సులో గ్లామరస్ గా కనిపించినప్పుడ్లా.. అసలు ఫ్యాషన్ స్టేట్మెంట్లు ఇచ్చే విషయంలో మా హీరోయిన్ ను మించిన అందగత్తే లేదంటూ వారు కాలర్లు ఎగరేస్తుంటారు. అది నిజమే. ఫ్యాషన్ విషయంలో తెలుగు హీరోయిన్లను కొత్త పుంతలు తొక్కించింది మాత్రం సమంత అనే చెప్పాలి. కాకపోతే అమ్మడు ఫ్యామిలీ ఈవెంట్లు అంటూ చీర కట్టుకుని వస్తుంది చూడండి.. అప్పుడు మాత్రం.. 30 ఏళ్ళకే వైరాగ్యం వచ్చినట్లు ఈ పెద్దరికం లుక్ ఏంటి శ్యామ్.. అంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.

అదిగో మొన్న కూడా ఢిల్లీలోని ఒక ఈవెంట్ కు.. అలాగే హైదరాబాద్ లో మరో ఈవెంటుకు.. సమంత అలా చీరలో మెరిసిపోయింది. చూడ్డానికి కుందనపుఉ బొమ్మలా ఉన్నప్పటికీ ఇలా చీరల్లో చాలా పెద్ద వయసు స్ర్తీ తరహాలో కనిపిస్తోందని అంటున్నారు నెటిజన్స్. మరి సమంత చీరలకు స్వస్తి పలికి చూడీదార్లతో కొత్త ట్రీట్ ఏమన్నా ఇస్తుందేమో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/