Begin typing your search above and press return to search.
గొడవలన్నీ మరిచి అక్కా అనేసిన అక్కినేని కోడలు!
By: Tupaki Desk | 18 Nov 2020 2:50 PM GMTఆన్ సెట్స్ కలిసి పని చేస్తే తారల మధ్య మంచి స్నేహానుబంధం పెరగడం సహజం. కలిసిమెలిసి ఒకరికొకరు ఎంతో సహకరించుకునేందుకు ఈ బాండింగ్ కూడా అవసరం. ఇప్పుడు అలాంటి స్నేహానుబంధాన్నే కొనసాగిస్తున్నారు నయనతార.. సమంత అక్కినేని.
అక్కా అని పిలిచేంత చనువు సమంతకు ఉంటే చెల్లి అని సంబోధించేంత చనువు నయన్ కి ఉందిట. సమంతా అక్కినేని.. నయనతార మంచి స్నేహితులుగా మారారని.. నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో నటిస్తుంటే మొదలైన బంధమిదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ రోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా సమంత ప్రత్యేకించి నయన్ కి శుభాకాంక్షలు చెప్పి అక్కా అంటూ సంబోధించడం చర్చకు వచ్చింది. “ఒకే ఒక్క నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు .. ఎల్లపుడూ ఇలానే ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండండి. జీవనగమ్యంలో మీ పోరాటం మాకు స్ఫూర్తినిస్తుంది. మీకు మరింత శక్తి కలగాలి సోదరీ .. మీ బలానికి నిశ్శబ్ద సంకల్పానికి నమస్కరిస్తున్నాను” అని సమంత ఎమోషనల్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అన్నట్టు విఘ్నేష్ సినిమా చేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్యా పొరపొచ్చాలొచ్చాయని కలతలతో దూరంగా ఉంటున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవా? ఇలా అక్కచెళ్లెల్లుగా కలిసిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజనం. మరి దీనికి సామ్ వద్ద ఆన్సర్ ఉందా?