Begin typing your search above and press return to search.
సమంత మళ్ళీ బోల్డ్ సీన్స్.. లిప్ లాక్!
By: Tupaki Desk | 22 May 2023 3:00 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇటీవల శాకుంతలం సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ ఆశించిన ఫలితం అందించలేదు. మూవీలోని పూర్ గ్రాఫిక్స్, సరిగా ఎమోషన్స్ పండకపోవడం వల్ల మూవీ రిజల్ట్ బోల్తా కొట్టింది. దానికి ముందు వచ్చిన యశోధ ఆమె కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది.
కాగా, ప్రస్తుతం సమంత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడి జనాలను సైతం ఆకర్షించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ రోల్ లో మెప్పించిన ఆమె, తాజాగా మరో వెబ్ సిరీస్ కి అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ లో సమంత చాలా బోల్డ్ గా కినిపించనుందని తెలుస్తోంది.
శాకుంతలం, యశోద మూవీల్లో చాలా పద్దతిగా కనిపించిన సామ్.. ఈ వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో కూడా నటించేందుకు ఒకే చెప్పిందనే ప్రచారం మొదలైంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చెప్రా చేసిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో సమంత నటిస్తోంది. దీనిలో ఆమె వరుణ్ ధావన్ కి జంటగా కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నాయని తెలుస్తోంది. వరుణ్ కి ఆమె లిప్ లాక్ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమంత చెప్పినట్లు తెలుస్తోంది.
మరి ఆమె ఇప్పటి వరకు రొమాంటిక్ సీన్స్ చేశారు. కానీ మరీ శృంగార సన్నివేశాల్లో నటించడం తక్కువ అనే చెప్పాలి. మరి ఈ వెబ్ సిరీస్ లో సమంత పాత్రను ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే సందేహం కలుగుతోంది.
ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే, ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ విడాకుల తర్వాతే ఆమె మరింత బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఒకే చెబుతుండటం విశేషం. విడాకులు అయిన వెంటనే పుష్పలో ఆమె చేసిన ఊ అంటవా మామ ఊహూూ అంటావా మామ పాట చేసి అందరినీ షాకింగ్ కి గురి చేసింది. మరో వైపు నాగ చైతన్య వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.