Begin typing your search above and press return to search.

ఇంతకీ సమంత కంపెనీ ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   3 Aug 2017 11:21 PM IST
ఇంతకీ సమంత కంపెనీ ఏం చేస్తుంది?
X
దాదాపు హీరోలందరూ కూడా ఒకటే స్టెప్ వేస్తున్నారు. అయితే రెస్టారెంట్ లేకపోతే బార్.. కుదిరితే స్పోర్ట్స్ క్లబ్ లేదంటే సొంతంగా ఏదన్నా స్కూలు కాలేజీ.. అందరూ ఇలా ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా హీరోలందరూ బిజినెస్ లు చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం ఖాళీగా ఎందుకు.. అందుకే తమన్నా గోల్డ్ జ్యుయలరీ బిజినెస్.. రకుల్ ప్రీత్ జిమ్ పెట్టుకున్నారు. ఇప్పుడు సమంత కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తోందట.

ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమా షూటింగులో బిజీగా ఉంటూ.. మరో ప్రక్కన తెలంగాణ గవర్నమెంట్ జరపదలిచిన వొవెన్ 2017 కార్యక్రమం కోసం ప్రమోషన్లు చేస్తోంది సమంత. ఇదే సందర్బంగా అమ్మడు తన సొంత కంపెనీ కల నెరవేరినట్లు తెలిపింది. SVS partners LLP అనే కంపెనీ పెట్టిందట సమంత. తనకు ప్రాణ స్నేహితులైన మేఘన.. వంశీ.. శ్రీరామ్ లతో కలసి ఈ కంపెనీ ప్రారంభించిందట. అయితే ఈ కంపెనీ ఏం పనులు చేస్తుందో తెలియదు కాని.. హ్యాండ్ లూమ్స్ కు సంబంధించి ఏదో చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ కంపెనీ కోసం ఎన్నో కలలు కన్నానని వాటిని త్వరలోనే సాకారం చేసుకుంటానని కూడా తెలిపింది.

మొత్తానికి సినిమా ఇండస్ర్టీ నుండి పెళ్ళిచేసుకున్న తరువాత ఏ స్టెప్ తీసుకుంటుందో తెలియదు కాని.. ఒకవేళ హీరోయిన్ గా పాత్రలు చేయకపోతే మాత్రం సొంతంగా ఇలా బిజినెస్ తో అమ్మడు ముందుకు దూసుకుపోతుందేమో. అందుకే ఈ ప్లాన్స్ అన్నీ. ఏమంటారు?