Begin typing your search above and press return to search.

అఖిల్ కోసం కదిలొచ్చిన వదిన?

By:  Tupaki Desk   |   23 Nov 2017 5:45 AM GMT
అఖిల్ కోసం కదిలొచ్చిన వదిన?
X
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తొలి చిత్రం అఖిల్. కానీ దీనికంటే ముందే.. మనం చిత్రంలో ఓ క్యామియో చేసి ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ఆ సినిమాలో మొత్తం అక్కినేని కుటుంబం అంతా కనిపించి సందడి చేసింది.. అభిమానులను అలరించింది.

ఇప్పుడు మరోసారి అలాంటి ఫీట్ రిపీట్ కానుందట. ఈసారి అఖిల్ కోసం మొత్తం ఫ్యామిలీ కదులుతోందని తెలుస్తోంది. మనం లాంటి ఎపిక్ మూవీని అక్కినేని ఫ్యామిలీకి ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్.. ఇప్పుడు అఖిల్ తో హలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. విడుదలకు ఇంకా కచ్చితంగా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో సినిమా గురించిన ఆసక్తికరమైన అంశాలను ఒక్కొక్కటిగా బయటకు వదులుతూ మూవీపై బజ్ పెంచుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో అఖిల్ తండ్రి నాగార్జున.. తల్లి అమల కూడా కాసింత సేపు మెరవనున్నారట.

వీరితో పాటు అక్కినేని కుటుంబంలోకి లేటెస్ట్ ఎంట్రీ అయిన సమంత కూడా ఓ సూపర్బ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది. వదినతో కలిసి మనం మూవీలో మెరిసిన అఖిల్.. ఆఫ్ స్క్రీన్ లోనూ చక్కని రిలేషన్ మెయింటెయిన్ చేస్తాడు. ఓ షాపింగ్ మాల్ కు వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్. మరోవైపు వదిన గురించిన అప్ డేట్స్ ను తెగ షేర్ చేస్తుంటాడు అఖిల్. ఇంతగా తనకు గౌరవం ఇస్తున్న అఖిల్ కోసం.. హలో మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో సమంత నటించిందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ లేదు కానీ.. ఈ న్యూస్ మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కి తెగ ఉత్సాహం ఇచ్చేస్తోంది.