Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లికూతురితో ఉగాది వావ్

By:  Tupaki Desk   |   7 April 2019 6:35 AM GMT
కొత్త పెళ్లికూతురితో ఉగాది వావ్
X
ఓ వైపు మజిలీ సక్సెస్ కిక్కు.. ఇంకో వైపు ఉగాది సంబరాల కిక్కు .. రెండిటిని అక్కినేని కోడలు సమంత ఎలా సెలబ్రేట్ చేశారో తెలుసా? ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. సమంత నటించిన తాజా చిత్రం `మజిలీ`కి విమర్శకుల ప్రశంసలు దక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మజిలీలో మరోసారి చెలరేగిపోయిందని కితాబందుకున్నారు. పతాక సన్నివేశాల్లో సామ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ కి క్రిటిక్స్ సహా అభిమానులు ఫిదా అయిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తన నటన గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. పక్కింటి అమ్మాయిలా.. మధ్య తరగతి వైఫ్ గా సామ్ ఒదిగిపోయి నటించిన తీరుకు ముగ్ధులం అయిపోయాం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పొగిడేస్తున్నారు. భవిష్యత్ లో సావిత్రి తర్వాత మీ బయోపిక్ తీస్తారు అంటూ కొందరు అభిమానులు అయితే కాస్త ఎక్కువగానే ఎగ్జయిట్ అయిపోతున్నారు.

ఓ వైపు మజిలీ సక్సెస్ టాక్ నడుమ అక్కినేని ఫ్యామిలీ ఖుషీ అవుతున్న తరుణంలో సమంత ఉగాది సెలబ్రేషన్ కోసం దగ్గుబాటి డాటర్ చెంతకు వెళ్లడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది. ఇటీవలే కొత్తగా పెళ్లయిన.. విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రితతో కలిసి ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నారు సామ్. కొత్త పెళ్లికూతురికి ఉగాది పచ్చడి తినిపించి నిన్నటిరోజంతా సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారని ఈ ఫోటో చెబుతోంది. ఇంతకీ ఈ ఉగాది పచ్చడిని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఆశ్రిత దగ్గుబాటికి చెందిన ఇన్ ఫినిటీ ప్లేటర్ బేకరీలోనేనట. ఆశ్రితకు ఉగాది పచ్చడి తినిపించిన సామ్ తనకు విషెస్ ని అందజేశారు.

అక్కినేని కుటుంబం తరపున కొత్త పెళ్లికూతురికి ఉగాది శుభాకాంక్షలు. మై బ్యూటీ.. ఇన్ఫినిటీ ప్లేటర్ .. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి ఈ గ్లో సూటవుతుంది.. అంటూ పొగిడేశారు సామ్. సాంప్రదాయక ఉగాది పచ్చడి లో మామిడి కాయ, చింతపండు.. అరటిపండు.. ఉప్పు .. వేప పువ్వు .. మిరపకాయ పౌడర్ అన్నిటినీ కలిపి తయారు చేశారట. ఈ పచ్చడిలో తీపి .. చేదు.. పులుపు.. ఉప్పు.. కారం ఎలా ఉంటాయో అలానే జీవితంలోనూ అన్ని రుచులు ఉంటాయి అంటూ ఆశ్రితకు బ్లెస్సింగ్స్ అందించారన్నమాట. పనిలో పనిగా ఇన్ఫినిటీ ప్లేటర్ కు సామ్ ప్రచారం చేశారన్నమాట.