Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఏమున్నావ్ సమంత
By: Tupaki Desk | 16 Jun 2017 10:15 AM ISTఒక సూపర్ స్టార్ సినిమా విడుదలకు అభిమానులు ఎంతలా ఎదురుచూస్తారో మనకు తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళ అభిమాన నటీనటులు ఎప్పుడు ఎప్పుడు ట్వీట్ చేస్తారా అని ఎదురుచూసే వాళ్ళు చాలమంది ఉన్నారు. సౌత్ హీరోయిన్లలో టాప్ లిస్టులో ఉన్న సమంత కు కూడా అలాంటి క్రేజే ఉంది సోషల్ మీడియాలో. సమంత చేస్తున్న సందడి ఆమె అభిమానులుకు ప్రతీ రోజు పండుగలాగా ఉంది. నాగ చైతన్య తో చిట్ చాట్ నుండి విశ్రాంతి విహారం సినిమాలు కొత్త పనులు.. అన్నీ పంచుకుంటుంది తన అభిమానులుతో. ఇప్పుడు అలాంటి పండుగ చేసుకొనే ఫోటో ఒకటి పెట్టింది.
నీలంరంగు గౌనులో బోసి నవ్వుతో బుజ్జి పాపాయి భలే ఉంది కదా. ఇక్కడ ఉన్న ఈ చిట్టి తల్లి సౌత్ ఇండియా ఏ లిస్ట్ హీరోయిన్ లో ఒకరిగా స్టార్ స్టేటస్ లో ఉన్న సమంత. తన పసితనంలో ముద్దుగా దిగిన ఫోటోని చాల జాగ్రతగా దాచిపెట్టి ఇప్పుడు అందరితో తన ఆనందాన్ని పంచుకుంది. అక్కినేని వారి కాబోయే కోడలు సినిమాలతో బిజీగా ఉంది కానీ తనలో ఇంకా అప్పటి పసి హృదయం ఉంది కాబట్టే చిన్నపిల్లలు - మహిళలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యూష సపోర్ట్ అనే సంస్థను స్థాపించింది. మొదటిలో అందరినీ తన అందం - నటనతో ఆకట్టుకుంది - ఆ తరువాత తన నడవడికతో అందరినీ మెప్పించి ఇప్పుడు మంచి మనసున్న మనిషిగా అభిమానుల మన్ననలు పొందుతుంది.
సమంత ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం 1985' షూటింగ్ కోసం సిద్దమవుతుంది. తమిళ్ లో శివ కార్తికేయన్ సినిమా ఈ వారం లో మొదలుకావస్తుంది. వీటితో పాటుగా స్టార్ తమిళ్ హీరోలు సినిమాలు కూడా కొన్ని చేస్తుంది. అక్టోబర్ లో పెళ్లి పెట్టుకొని అమ్మడు పెళ్లి గురించి ఆలోచించకుండా ఇలా సినిమాలు సేవలతో బిజీగా ఉండడం వాళ్ళ అభిమానులు గుండెలో దేవత మాదిరి మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/